Sunday, March 16, 2025

జనసేనలోకి తోట త్రిమూర్తులు.. నిజం ఎంత?

- Advertisement -

ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏ నేత ఎప్పుడూ ఏ పార్టీలో ఉంటారో చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మంది నేతలు గుడ్ బై చెబుతున్నారు. ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక్కొక్కరు వీడుతున్నారు. ఇటువంటి తరుణంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు జనసేనలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. జనసేన పెద్దలతో చర్చలు పూర్తయ్యాయని.. త్వరలో ఆయన జనసేనలో చేరడం ఖాయమని టాప్ నడుస్తోంది.

తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు తోట త్రిమూర్తులు. గ్రామస్థాయి రాజకీయాలు చేసుకునే ఆయన 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. రామచంద్రపురం నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదిగారు. 1994 ఎన్నికల్లో టిడిపి టికెట్ ఆశించారు. కానీ ఛాన్స్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అనంతరం టిడిపిలో చేరి అదే పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగారు. 1999లో మరోసారి రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2004లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ చేతుల్లో ఓడిపోయారు.

మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలో చేరారు తోట త్రిమూర్తులు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చవి చూశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో కాంగ్రెస్ లోకి వెళ్లాల్సి వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం, ఆయనకు మద్దతుగా ఎమ్మెల్యేలు వెళ్లడంతో రామచంద్రపురం నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు తోట త్రిమూర్తులు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రమాదకరంగా మారింది. ఈ తరుణంలో ఆయన తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2019లో పోటీ చేసి ఓటమి చవి చూశారు. అనంతరం టిడిపికి గుడ్ బై చెప్పి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయనకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. త్వరలో ఎమ్మెల్సీ పదవీకాలం కూడా పూర్తవుతుంది. ఈ తరుణంలో జనసేన లో చేరితే బాగుంటుంది అన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వియ్యంకుడు సామినేని ఉదయభాను జనసేనలో చేరారు. ఆయన ద్వారా త్రిమూర్తులు సైతం జనసేనలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!