Bigg Boss 8 : బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ రోజురోజుకు రసవత్తరంగా సాగుతోంది. బిగ్ బాస్ కంటెస్టెంట్ల మెదల్లకు పదును పెట్టిస్తూ.. వారికి చిరాకు తెప్పిస్తూ.. వారి సత్తా ఎంటో పరీక్షిస్తున్నాడు. విచిత్రమైన టాస్క్ లు, అర్థంపర్థం లేని నామినేషన్లు.. అంటూ ఓ వర్గం ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంటే, మరో వర్గం ప్రేక్షకులు మాత్రం ఫైట్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. నాలుగో వారం నామినేషన్లు హౌస్‌ని హీటెక్కించాయి. నిన్నటితో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ హౌస్‌లో సోనియా ఆడుతున్న రాంగ్ గేమ్‌తో పాటు.. ఆమె పెత్తనం.. పృథ్వీ, నిఖిల్‌లను తన చెప్పు చేతుల్లోకి తీసుకోవడం.. ఇదంతా ప్రేక్షకులు చూస్తున్నారు.. కానీ యష్మీని మాత్రం చిరాకు తెప్పించి ఏడిపించింది.
యష్మీ మాటలతో సోనియా గురించిన నిజం బయటపడిందని అనుకుంటున్నారు బిగ్ బాస్ ప్రేక్షకులు.. సోనియా బుద్దిని బయటపెట్టి కడిగిపారేసింది కన్నడ భామ. ఇక హౌస్‌మేట్స్ అందరూ యష్మీకి మద్దతుగా నిలిచి సోనియాపై నిప్పులు చెరిగారు. వీరిద్దరి గొడవలు ఒకానొక సమయంలో తారాస్థాయికి చేరడంతో పాటు యష్మీ ఏడ్చేసింది. దీంతో ఒక్కసారిగా ఇల్లంతా సోనియాకు యాంటీగా మారిపోయింది. ఇవేమీ పట్టించుకోకుండా సోనియా మళ్లీ అర్ధరాత్రి నిఖిల్, పృథ్వీలతో కలిసి పులిహోరను కలిపేసింది. ఇది చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. ఛీ ఛీ నీకు అసలు బుద్దిలేదు అంటూ కామెంట్స్ చేస్తూ నిన్నటి ఎపిసోడ్ హైలెట్ చేస్తున్నారు.
బిగ్ బాస్ హౌస్‌లో చిల్లర గేమ్స్ ఆడుతూ ముఖ్యంగా సోనియా టీం సభ్యులు చేస్తున్న రచ్చ దారుణంగా ఉంది. నిఖిల్, పృథ్వీలను దద్దమ్మలుగా ప్రేక్షకులు భావిస్తున్నారు. సోనియాకు బాడీగార్డులుగా మారారని విమర్శిస్తున్నారు. యష్మీ గేమ్ కు అభిమానులు పెరిగిపోయారు. మణికంఠ ఎంత ఎదగాలని చూస్తున్నా.. అంత తొక్కిపెట్టడంపై ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం.. నిన్నటి ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇక సీత, ప్రేరణ, యష్మీలు చీఫ్ అవ్వకుండా నామినేట్ చేయగా.. నైనికా.. విష్ణులు ప్రియను నామినేట్ చేశారు. ఇక పృథ్వీ మణికంఠను చీఫ్ కాకుండా నామినేట్ చేశాడు.. నిఖిల్ రెండుసార్లు సుత్తి గెలిచి.. సోనియాకు ఫేవర్ గా ఉన్నట్లే ఉంటూ డబుల్ గేమ్ ఆడాడు. చివరగా, కాంతారా కొత్త చీఫ్‌గా సీత ఎన్నికైంది. దీనికి సంబంధించిన టాస్క్ లో హోరా హోరీ నడిచింది. ఎవరికి వారు తమ పెర్ఫామెన్స్ చూపెట్టారు. సీత కాస్త తెలివిగా అందరి నుంచి తప్పించుకుని చీఫ్ గా ఎన్నికైంది. ఈ క్రమంలోనే ఈరోజు మరో టాస్క్ ఇవ్వనున్నారు బిగ్ బాస్.. అయితే నామినేషన్స్, ఓటింగ్ ప్రకారం చూస్తే సోనియా ఈ వారం బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.b