Tuesday, October 8, 2024

Bigg Boss 8 : 4వ వారం నామినేషన్స్ లీక్.. ఎవరెవరు ఉన్నారంటే ?

- Advertisement -


Bigg Boss 8 :దేశ వ్యాప్తంగా బుల్లితెర చరిత్రలో సరికొత్త ట్రెండ్ సృష్టించిన ఏకైక రియాల్టీ షో బిగ్ బాస్. పలు భాషల్లో ప్రసారం అవుతున్న ఈ షోకు దీనికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అందుకే ఈ షో ప్రసారమైన ప్రతిసారీ ఆయా భాషల్లో నంబర్ వన్‌గా నిలుస్తోంది. దేశంలోనే ముఖ్యంగా తెలుగులో అత్యధిక రేటింగ్‌ను అందుకుంటోంది. దీంతో మేకర్స్ ఇప్పుడు ఎనిమిదో సీజన్‌ను రన్ చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రన్ అవుతున్న ఈ సీజన్‌లో నాలుగో వారంలో నామినేషన్ల వివరాలు లీక్ అయ్యాయి. ఎవరు నామినేట్ అయ్యారో చూద్దాం..

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితం అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్ మెంట్ అనే కాన్సెప్ట్ తో దీన్ని ప్రారంభించారు. ఇందులో మొదటి నుంచి ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టాస్క్‌లలో వైవిధ్యం చూపిస్తున్నారు. దీంతో తగాదాలు ఎక్కువై ఈ సీజన్ రచ్చ రచ్చగా మారుతోంది. ప్రేరణ కంభం, యష్మీ గౌడ, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, ఢీ ఫేమ్ నైనిక, విష్ణుప్రియ భీమనేని, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాషా, నాగ మణికంఠ, అభయ్ నవీన్‌లు బిగ్‌బా ఎనిమిదో సీజన్‌లో కంటెస్టెంట్‌లుగా అడుగు పెట్టారు. అయితే మొదటి వారంలో బేబక్క, రెండో వారంలో శేఖర్ బాషా, మూడో వారంలో అభయ్ ఎలిమినేట్ అయ్యారు.

గతవారం బిగ్ బాస్ హౌస్ లో ‘ప్రభావతి 2.0’ టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో కంటెస్టెంట్స్ గుడ్ల కోసం ఓ రేంజ్ లో కొట్టుకున్నారు. సీజన్‌లో అతిపెద్ద పోరాటాలు ఇక్కడే జరిగాయి. దీంతో శనివారం ఎపిసోడ్ లో కూడా నాగార్జున చాలా మందికి క్లాస్ పీకాడు. దీంతో నాలుగో వారంలో జరగనున్న నామినేషన్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బిగ్ బాస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నాలుగో వారం నామినేషన్ ప్రక్రియ కూడా పాత పద్ధతిలోనే జరగనుంది. ముఖ్యంగా ఇప్పుడు హౌస్ లో ఉన్న చీఫ్ నిఖిల్ తప్ప అందరూ నామినేట్ కావచ్చు. ఈ టాస్క్‌లో భాగంగా నామినేట్ చేసే కంటెస్టెంట్స్ ముఖంపై స్ప్రే చేసి కారణాలను వెల్లడించాల్సి ఉంటుంది.

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ నాలుగో వారం నామినేషన్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. తాజా సమాచారం ప్రకారం ఆరుగురిని మాత్రమే నామినేట్ చేశారు. వీరిలో ప్రేరణ, పృథ్వీరాజ్ శెట్టి, నాగ మణికంఠ, ఆదిత్య ఓం, నబీల్, సోనియా ఆకుల ఎలిమినేషన్ జోన్‌లోకి ప్రవేశించినట్లు తాజా సమాచారం లీక్ అయింది. ప్రస్తుతం ప్రసారమవుతున్న బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో అనేక అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా నామినేషన్లలో ముఖ్యులకు ప్రత్యేక అధికారాలు ఇస్తారు. ఐతే ఇప్పుడు నిఖిల్‌కి ఎవరినైనా కాపాడే శక్తిని బిగ్ బాస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న నైనికను తప్పించాడు. దీంతో ఆమె నామినేషన్ నుంచి తప్పుకుంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!