Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మరో రెండ్రోజుల్లో రెండు వారాలు పూర్తి కానుంది. ఇప్పటి వరకైతే షో ఆశించిన స్థాయిలో లేదు. కంటెస్టెంట్స్ ఎంపిక కూడా బాగాలేదు. విష్ణుప్రియ, ఆదిత్య ఓం ఇద్దరు మాత్రమే తెలిసిన ముఖాలు. సీరియల్ నటీనటులు యష్మీ గౌడ, పృథ్వీరాజ్, నిఖిల్, ప్రేరణ అంతగా పాపులర్ కాలేదు. పైన కన్నడ బ్యాచ్. సీజన్ 8 గేమ్‌లు, టాస్క్‌లు కూడా నిరాశపరిచాయి. బిగ్ బాస్ తెలుగు మొదటి వారం టీఆర్పీ దారుణంగా ఉంది. బేబక్క ఎలిమినేషన్‌తో హౌస్‌లో 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఎవరూ ప్రభావం చూపడం లేదు. ప్రేక్షకులు ఎంటర్ టైన్ మెంట్ అందించే కంటెస్టెంట్లను కోరుకుంటున్నారు. గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో 14 మందిని మాత్రమే పరిచయం చేశారు. సీజన్ 7 లాగా ఐదు వారాల తర్వాత మినీ లాంచ్ ఈవెంట్ ఉంటుంది. కనీసం ఐదుగురి పోటీదారులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారైన కాస్త పేరున్న నటీనటులను హౌసులోకి పంపాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మళ్లీ షో గాడిలోకి రావాలంటే స్టార్ డమ్ ఉన్నవాళ్ల ఎంట్రీ కావాలని ఆలోచిస్తున్నారు.
ఈ క్రమంలోనే సీరియల్ యాక్టర్ జ్యోతిరాయ్ ను సంప్రదించారట మేకర్స్. ఆమె పచ్చజెండా ఊపినట్లు వార్తలు వచ్చాయి. సూపర్ హిట్ సీరియల్ గుప్పెడంత మనసులో జ్యోతిరాయ్ హీరో తల్లిగా నటించింది. ఆ పాత్రలో జ్యోతిరాయ్‌ని చూసి ప్రేక్షకులు ఆమెను మధ్య వయస్కురాలే అనుకున్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చూసిన జనాలు మైండ్ బ్లాక్ అయ్యారు. జ్యోతి రాయ్ నా వయసు కేవలం 30 ఏళ్లు. జ్యోతిరాయ్ హాట్ ఫోటో షూట్ లు చూసి గుప్పెడంత మనసులో ఉన్నది తనేనా అని ఆశ్చర్యపోయారు. జ్యోతిరాయ్ గ్లామరస్ ఫోటో షూట్‌లు వైరల్‌గా మారాయి. యూత్ లో భారీ ఫేమ్ రాబట్టుకుంది. జ్యోతి రాయ్ బిగ్ బాస్ హౌస్ కి వస్తే పండగే అని ఆడియన్స్ భావించారు. కానీ జ్యోతిరాయ్ షోకి రావడం లేదట. దీనిపై ఆమె స్వయంగా స్పష్టత ఇచ్చింది.
కన్నడ, తెలుగు బిగ్ బాస్ షోలలో నేను పాల్గొనడం లేదు. నటిగా బిజీగా ఉన్నాను. నేను నటించిన 4 తెలుగు సినిమాలు 2025లో విడుదల కానున్నాయి.బిగ్ బాస్ షోకి వస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి అని జ్యోతిరాయ్ అన్నారు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్లో బిజీగా ఉంది. జ్యోతిరాయ్‌కి చిన్నతనంలోనే పెళ్లై మగబిడ్డ పుట్టాడు. తర్వాత భర్తతో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె దర్శకుడు పూర్వాజ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంది. మరోవైపు బిగ్ బాస్ వారాంతానికి చేరువవుతోంది. ఓటింగ్‌కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చే రెండో కంటెస్టెంట్ ఎవరనే చర్చ సాగుతోంది. విష్ణుప్రియ, నిఖిల్, నాగ మణికంఠ, సీత, నైనికా, ఆదిత్య ఓం, శేఖర్ బాషా, పృథ్వీరాజ్ నామినేషన్ల జాబితాలో ఉన్నారు. వారిలో ఒకరు హౌసు నుంచి ఎలిమినేట్ కానున్నారు.