Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. చూస్తుండగానే రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగుపెట్టింది. నామినేషన్ల సమయంలో వేడెక్కిన ఇంటిని చల్లార్చేందుకు బిగ్ బాస్ టాస్క్ పెట్టారు. ఈ క్రమంలో ముందుగా రేషన్ టాస్క్ ఇచ్చారు. బిగ్ బాస్ కొత్త చీఫ్ అభయ్.. పాత చీఫ్ నిఖిల్ టీమ్‌ల మధ్య టాస్క్‌లను కేటాయించారు. ఈ క్ర మంలో నిఖిల్ టీమ్ ఎక్కువ టాస్క్ లు గెలిచి ఎక్కువ రేషన్ పొందారు. వారితో పోలిస్తే అభయ్ టీమ్ కి కొంచెం తక్కువ రేషన్ వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఇంట్లో వంటగదిలో కొత్త రూల్స్ పెట్టారు. ఈ క్రమంలో బిగ్ బాస్ పై అభయ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
కంటెస్టెంట్ల మధ్య మరోసారి చిచ్చు పెట్టేందుకు బిగ్ బాస్ సరికొత్త ప్లాన్ వేశాడు. ఇంటి కిచెన్ లో ఒక కొత్త రూల్ మరొక ఫిట్టింగ్ పెట్టాడు. ‘‘ ఇంటి కిచెన్ లో ఇప్పటి నుంచి ఓ కొత్త రూల్ వచ్చింది. ఒక్క సమయంలో ఒక క్లాన్ కు చెందిన సభ్యులు మాత్రమే వంట చేసుకోవాలి. అలాగే వంటలో ముగ్గురు సభ్యులు మాత్రమే పాల్గొనాలి. కిచెన్ అందుబాటులో ఉన్న సమయంలో కూరగాయలు కోయడం కూడా పరిగణనలోకి తీసుకోబడుతుంది. మీకు ఈ వారంలో ఇచ్చిన సమయంలో మాత్రమే వంట పూర్తి చేసుకునే వీలుంటుంది.’’ అంటూ కిచెన్ ఉపయోగించుకోవడంపై టైం లిమిట్ పెట్టారు బిగ్ బాస్. ఆ రూల్స్ ను కంటెస్టెంట్ సీతా చదివి వినిపించింది.
కొత్త రూల్స్ నచ్చని అభయ్ కి కోపంలో ఊగిపోయాడు. ‘వీళ్లు మనిషి పుట్టుక పుట్టారో లేదో నాకు అర్థం కావడం లేదు.. యూస్ లెజ్ ఫెలోస్.. అంత మందికి ముగ్గురు ఎలా వండుతారు.? దిమాక్ లేదు ఏం లేదు.. అని చేతిలోని పిల్లోని విసిరి అక్కడి నుంచి వెళ్లిపోయాడు అభయ్.. అంతతో ఆగకుండా.. కిచెన్ దగ్గరకు వెళ్లి.. ‘తినడానికి టాస్క్‌లు పెడుతున్నారా? తినకుండా ఉండేందుకు టాస్కులు పెడుతున్నారా అర్థం కావడం లేదని మండిపడతాడు. అలాగే గత ఎపిసోడ్‌లో రెండు గ్రూపుల మధ్య ఎగ్స్ టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ సమయంలో నిఖిల్ జట్టు ఇష్టానుసారంగా ఆడడంతో.. మిగతా జట్టు సభ్యులకు గాయాలు అయ్యేలా చేసింది. ఆ టాస్క్‌లో నానా రభస జరిగింది. అయితే.. అలాంటి వైలెన్స్ జరగకుండా గుడ్ల సంఖ్య పెంచుకోవడం కోసం మరో అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. కంటెస్టెంట్లు అందరినీ గేమ్ పాయింట్‌కి పిలిచి మరో టాస్క్ ఇచ్చారు.
గుడ్ల సంఖ్యను పెంచడానికి బిగ్ బాస్ ఇద్దరు సభ్యులకు అవకాశం ఇచ్చారు. మరొక టాస్క్ ‘మూవింగ్ ప్లాట్‌ఫారమ్’ టాస్క్ అని పిలుస్తారు. కదిలే ప్లాట్‌ఫారమ్‌లో బంతులను బ్యాలెన్స్ చేసి రంధ్రాల్లో వేయాలని..రంధ్రాల్లోని బంతుల ప్రకారం గుడ్లు లభిస్తాయని బిగ్ బాస్ చెప్పారు. ఈ గేమ్‌లో అభయ్, నైనికా ఆడారు. ఈ టాస్క్‌కి పృథ్వీ సంచాలక్ గా వ్యవహరించాడు. ఓవరాల్‌గా ఈ టాస్క్‌లో నైనికా అత్యధిక గుడ్లను గెలుచుకుంది.