Thursday, October 3, 2024

Bigg Boss 8: 3వ వారం మైండ్ బ్లాక్ ఓటింగ్.. టాప్‌లో ఊహించని కంటెస్టెంట్

- Advertisement -


Bigg Boss 8: తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో ‘బిగ్ బాస్’.. రొమాన్స్, లవ్, ఏడుపు, ముఖ్యంగా కంటెస్టెంట్ల మధ్య గొడవలతో రసవత్తరంగా కొనసాగుతోంది. గత సీజన్‌లతో పోలిస్తే, ప్రస్తుతం ప్రసారం అవుతున్న ఈ సీజన్లో చాలా మంది కంటెస్టెంట్ల మధ్య సమన్వయం లేదు. దీంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఫలితంగా, సీజన్-8లో అనేక కొత్త కొత్త సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో మూడో వారంలో నామినేషన్ల పర్వం ముగిసింది. అయితే నామినేషన్స్ ముగిసిన తర్వాత మైండ్ బ్లాక్ అయ్యే ఓటింగ్ నమోదైంది. దానికి సంబంధించిన వివరాలు చూద్దాం.

తెలుగులో బిగ్ బాస్ షో ప్రతి సీజన్ సక్సెస్ అవుతూనే ఉంది. అందుకే ఏడు సీజన్లు ఒకదాని తర్వాత ఒకటి భారీ రేటింగ్స్‌తో విజయవంతమయ్యాయి. ఈ క్రమంలో ఇప్పుడు ప్రసారమవుతున్న 8వ సీజన్ కూడా విజయవంతంగా నడుస్తోంది. ఇందులో చాలా ట్విస్ట్‌లు ఉన్నాయి. మేకర్స్ ఈ సీజన్లో మునుపటి కంటే విభిన్నమైన కంటెంట్‌ని చూపడంతో ప్రేక్షకుల నుండి భారీ స్పందన వస్తోంది. ప్రేరణ కంభం, యష్మీ గౌడ, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, ఢీ ఫేమ్ నైనిక, విష్ణుప్రియ భీమనేని, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాషా, నాగ మణికంఠ, అభయ్ నవీన్ ఎనిమిదో సీజన్‌లో కంటెస్టెంట్లుగా హౌసులోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో బెజవాడ బేబక్క మొదటి వారం ఎలిమినేట్ కాగా, రెండో వారంలో శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారు.

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ మూడో వారంలో జరిగిన నామినేషన్ ప్రక్రియ కూడా పలు వివాదాలను చవిచూసింది. కొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు. ఈ వారం మొత్తం ఎనిమిది మంది సభ్యులు నామినేట్ అయ్యారు. వీరిలో అభయ్, విష్ణుప్రియ భీమనేని, కిర్రాక్ సీత, యష్మీ గౌడ, నాగ మణికంఠ, పృథ్వీరాజ్ శెట్టి, ప్రేరణ, నైనిక నామినేట్ అయ్యారు. నామినేషన్ల ప్రక్రియ ఒక్కరోజులో పూర్తి కావడంతో ఎనిమిదో సీజన్ మూడో వారం ఓటింగ్ ప్రక్రియ సోమవారం రాత్రి నుంచి ప్రారంభమైంది. మైండ్ బ్లాక్‌ అయ్యే ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఈసారి విష్ణుప్రియ టాప్‌లో ఉన్నందున.. తక్కువ ఫాలోయింగ్‌తో షోలో అడుగుపెట్టిన కంటెస్టెంట్ నాగ మణికంఠ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఎనిమిదో సీజన్ మూడో వారంలో ప్రస్తుతం విష్ణుప్రియ భీమనేని, మణికంఠ టాప్ 2 స్థానాల్లో ఉన్నారు. వారి తర్వాత స్థానాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. కిర్రాక్ సీత మూడో స్థానంలో, నైనిక నాలుగో స్థానంలో, యష్మీ గౌడ ఐదో స్థానంలో నిలిచారు. ఈ ఓటింగ్ ఇలాగే కొనసాగితే ఈ వారం వారంతా సేఫ్ జోన్లో ఉన్నట్లే. మూడో వారం ఓటింగ్‌లో ప్రేరణ ప్రస్తుతం ఆరో స్థానంలో ఉన్నారు. అలాగే పృథ్వీరాజ్ ఏడో స్థానంలో, అభయ్ ఎనిమిదో స్థానంలో నిలిచారు. అంటే.. ఈ ముగ్గురు డేంజర్ జోన్‌లో ఉన్నారనే చెప్పాలి. ఇదిలా ఉంటే తాజాగా నామినేషన్స్ లో నిఖిల్ కోసం అభయ్ బలి అయ్యాడు. ఇప్పుడు అదే అతడి కొంప ముంచేలా కనిపిస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!