Bigg Boss 8 : తెలుగు బిగ్ బాస్ సీజన్ 8.. 23వ రోజు తొలి ప్రోమోను నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. హౌసులో చంద్రముఖిలా చెలరేగి డేర్ అండ్ డాషింగ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ యష్మీ తొలిసారిగా ఏడ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎప్పుడూ ఎవరినైనా భయపెట్టే ఈమె ఇలా ఎందుకు ఏడుస్తోందని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు నువ్వు కూడా ఏడుస్తావా? నీలో ఈ యాంగిల్ ఉందా..? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. చంద్రముఖిని సోనియా ఎందుకు ఏడిపించింది? అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..?
నామినేషన్స్‌లో భాగంగా యష్మీ ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో సోనియాను నామినేట్ చేసింది. పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ తన స్ట్రాటజీని చూపించింది. మొదట్లో నేను తప్పు చేసినా నువ్వు మాట్లాడతావని ఊహించి నిన్ను నా క్లాన్ లోకి తీసుకున్నాను. కానీ నువ్వు ఆ రూల్ అసలు ఫాలో అవ్వలేదు. అయితే నిఖిల్ క్లాన్ లో ఉన్నప్పుడు మాత్రం బాగానే సలహాలిస్తూ ముందుకు పోతున్నావు. ఇక నా రెండో పాయింట్ ఎగ్ టాస్క్ గురించి నువ్వే చెప్పావు .. నిఖిల్, పృథ్వి ఆగ్రేషన్ నీ స్ట్రెంత్ అని, ఆ బలాన్ని నువ్వు వాడుకున్నావు తప్ప నువ్వు ముందుకు రాలేదు ఇద్దరి సపోర్ట్ లేకుండా నువ్వు సపరేట్ గా ఆడి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది అంటూ రీజన్ చెబుతూ సోనియాను యష్మీ నామినేట్ చేసింది.
దీనికి సోనియా మాట్లాడుతూ.. నేను పృథ్వీ, నిఖిల్‌లను ముందు పెట్టి నేను ఆడలేదు అంటున్నావు కదా.. నేను దానికి ఒప్పుకుంటాను. కానీ నను ఇక్కడ ఉన్న ఏ మగాడి కంటే కూడా అగ్రేషన్లో ఎక్కువగానే ఉంటాను. నా అగ్రేషన్ల్ వల్ల ఎవరినీ నేను హర్ట్ చేయకూడదని అనుకున్నాను. నేను గేమ్ లోకి దిగాక ఎవరిని కొడతానో కూడా నాకే తెలియదు. ఎందుకురా బాబు.. కొట్టకుండా ఉండాలని అనుకున్నాను. అయితే మీ ఫెయిల్ట్ సంచాలక్ నా గేమ్ చూపించుకునే అవకాశం నాకు కల్పించారు. అందుకే చివరిలో వచ్చిన నిన్ను, ప్రేరణను ఎత్తేశానంటూ సోనియా చెప్పుకొచ్చింది.
ఇక తర్వాత నామినేషన్లలో నిఖిల్, పృథ్వీలను చూస్తూ ఉండిపోతే నీలాగా సిస్టర్, మదర్ అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ నేను చేయలేనంటూ కోపగించుకుంది యష్మీ, దానికి సోనియా చూడాలి కదా యష్మీ ఎంత సేపు, నిఖిల్, పృథ్వీలను చూస్తే ఎట్లయితుంది అంటూ రెచ్చగొట్టింది. అవును నా ఇష్టం నాకు కావాలంటే నేను నిఖిల్ నే చూస్తాను. నా ఇష్టం. నేను ఎవరిని చూసినా గేమ్ వచ్చినప్పుడు గేమే ఆడతాను. నీకు మాదిరిగా వాళ్లను వదిలేసి నిలుచోను. అయినా ప్లేటు ఎలా తిప్పాలో ఎవరిని ఎలా వాడుకోవాలో నీకు సూపర్ గా తెలుసు. నువ్వు మదర్ అంటావ్ , సిస్టర్ అంటావ్ , సెంటిమెంటు అంటావ్ అందరినీ వాడుకుంటున్నావు అంటూ కంటెస్టెంట్ల సాక్షిగా సోనియా పరువు తీసింది . ఆ తర్వాత ఎమోషనల్ గా హర్ట్ అయిన యష్మి కంటతడి పెట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.