Saturday, October 5, 2024

Big Boss 8 Telugu: ఏంటి.. బేబక్క వారానికే అంత వసూలు చేశావా ?

- Advertisement -

Big Boss 8 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్ మెంట్ అనే ట్యాగ్ లైన్ తో ప్రారంభమైంది. దీనికి తగ్గట్టుగానే హౌస్ మేట్స్ మొదటి రోజు నుంచి గొడవలు, కేకలు వేస్తూ ప్రేక్షకులకు వినోదం పంచారు. కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 8 తెలుగు సీజన్‌లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు ప్రవేశించిన సంగతి తెలిసిందే. వీరిలో విష్ణుప్రియ, బెజవాడ బేబక్క, నాగ మణికంఠ, పృథ్వీరాజ్, సోనియా ఆకుల, శేఖర్ బాషా నామినేషన్ల తొలి వారంలో నామినేట్ అయ్యారు. ఈ నామినేషన్ల పర్వం రెండు రోజుల పాటు కొనసాగింది. నామినేషన్ల పర్వం పూర్తయిన వెంటనే ఓటింగ్ పోలింగ్ ప్రారంభమైంది.

తొలి రోజు నుంచి యాంకర్ విష్ణుప్రియ మంచి ఓటింగ్ నమోదు చేసింది. తర్వాతి స్థానంలో మణికంఠకు అత్యధిక ఓట్లు వచ్చాయి. విష్ణుప్రియకు 30 శాతం అంటే 41,635 ఓట్లు పోలుకాగా.. నాగ మణికంఠకు 27 శాతం అంటే 36,908 ఓట్లు వచ్చాయి. అటు పృథ్వీరాజ్‌కు 13 శాతం అంటే 18,253 ఓట్లు రాగా సోనియా ఆకులకి 10 శాతం అంటే 13,958 ఓట్లు, శేఖర్ బాషాకు 10 శాతం అంటే 13,859 ఓట్లు లభించాయి. చివరకు అదే పది శాతం అంటే 13,747 ఓట్లు తో చివరి స్థానంలో నిలిచిన బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేషన్‌ను నాగార్జున ప్రకటించగానే స్టేజీపై బేబక్క ఏవీ వేశారు. అనంతరం హౌజ్‌లో సీత, విష్ణుప్రియ, మణికంఠ ఎమోషనల్ అయ్యారు. అనంతరం హౌజ్‌లో ఉండేందుకు అర్హత లేనివాళ్లను రోడ్డున పడేసేయ్ అని నాగార్జున చెప్పారు. అనంతరం హౌజ్‌లో సీత, విష్ణుప్రియ, మణికంఠ ఎమోషనల్ అయ్యారు. అనంతరం హౌజ్‌లో ఉండేందుకు అర్హత లేనివాళ్లను రోడ్డున పడేసేయ్ అని నాగార్జున చెప్పారు. దాంతో నెగెటివిటీ ఎక్కువగా ఉందన్న కారణంతో సోనియా ఆకుల, అగ్రెషన్ ఎక్కువ అనే రీజన్‌తో పృథ్వీరాజ్, నిఖిల్ వల్లే తాను ఎక్కువగా నెగెటివ్ అయ్యానని అతడిని, సోలోగా ఉంటూ, కాన్ఫిడెంట్ లేకుండా ఉంటాడని మణికంఠ పేర్లు చెప్పింది బేబక్క. వారి ఫొటోలను రోడ్డుపై ఉన్న మార్క్‌పై పేస్ట్ చేసింది. అనంతరం బేబక్క హౌజ్‌ను బయటకు వెళ్లిపోయింది.

ఇదిలా ఉంటే, బిగ్ బాస్ 8 తెలుగు హౌస్‌లోకి యూట్యూబర్‌గా అడుగుపెట్టిన బేబక్క వారానికి సుమారు రూ. 2లక్షల 50వేలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ రోజులు ఉంటే ఈ మొత్తం పెరిగి ఉండేది. కానీ, బిగ్ బాస్ సంప్రదాయం ప్రకారం, వంటగదిలోకి చొరబడి అతి తక్కువ సమయంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వలె, బేబక్క కూడా అవుట్ అయింది. యూట్యూబర్‌గా పాపులర్ అయిన బెజవాడ బేబక్క అసలు పేరు మధు నెక్కంటి. ఆమెకు సోషల్ మీడియాలో 1.64 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. బిగ్ బాస్ తర్వాత బేబక్క ఫాలోవర్స్ 1.83వేలు పెరిగారు. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలాంటి నెగిటివిటీ లేకుండా వెళ్లిపోయిన బేబక్క కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి. హౌస్ లో ఈమె తనపై ఏమి జరిగిన చాలా తేలికగా తీసుకుని సాఫ్ట్ గా ఉండడం, ఈమె ఆడియన్స్ కి పెద్దగా తెలియకపోవడం వల్లే మొదటి వారంలోనే హౌస్ నుండి బయటకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!