Monday, November 11, 2024

8 మంది మరణానికి ఐస్ క్రీమ్ బండి కారణమా? ఆ మాట అనడానికి సిగ్గులేదా చంద్రబాబు

- Advertisement -

నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన ఘటన అన్ని వర్గాల ప్రజలను కలిచివేసింది. చంద్రబాబు సభకు వచ్చి 8 మంది మరణించారు. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న ప్రదేశంలో ఈ సభ పెట్టడం వల్ల ఈ ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్ష్యాలు తెలిపారు. 1500 మంది కూడా పట్టని ప్రదేశంలో 5000 మందిని తరలించారని..నిలుచువడానికి ప్రదేశం లేకనే డ్రైనేజీ కాల్వ మీద నిలుచున్నరన సభకు వచ్చిన ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే ఈ ఘటనపై టీడీపీ నేతలు భిన్నంగా మాట్లాడుతున్నారు. ఈ మంది మరణించడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణం అని కొందరు టీడీపీ నాయకులు వ్యాఖ్యనిస్తున్నారు. ఆ నెపాన్ని పోలీసుల వైఫల్యంగా ఎత్తి చూపడం ఏమాత్రం సరికాదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే వచ్చే జనానికి, ఉండే పోలీసులకు మధ్య అసలు వ్యత్యాసమే ఉండదు. వేలల్లో జనాలు వస్తే.. పదుల సంఖ్యలో పోలీసులుంటారు. ఇరుకు సందే.. ప్రాణాలు పోవడానికి కారణమా? అడ్డుకుంటే విమర్శలు… వారిని అదుపు చేయడం సాధ్యం కాదు. అదుపు చేయడానికి ప్రయత్నించినా పోలీసులను విమర్శిస్తారు. దీనిపై టీడీపీపై విమర్శలు రావడంతో.. ఇప్పుడు వారు రూటు మార్చారు.

ఇప్పడు కందుకూరు ఘటనలో ఎనిమిది మంది మరణించడానికి ఐస్ క్రీమ్ బండ్లు కారణమని చెబుతున్నారు. ఇరుకు రోడ్డులో ఐస్ క్రీమ్ బండ్లు పెట్టడం మూలాన వాటిపై పడి ప్రజలు తొక్కిసలాటలో మరణించారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. సహజంగా సమావేశాలు జరుగుతున్న సమయంలో మొబైల్ ఐస్ క్రీమ్ బండ్లు వచ్చి అక్కడ విక్రయిస్తుంటారు. ఎక్కువ స్థాయిలో బేరం జరుగుతుందని భావించి రోడ్డుపైనే ఐస్ క్రీమ్ బండ్లు పెడతారు. ఇక్కడ విశేషం ఏమిటంటే చలికాలంలో ఐస్ క్రీమ్‌లు పెద్దగా ఎవరు తినరు. అది కూడా రాత్రి 8 గంటల తరువాత ఎవరైనా ఐస్ క్రీమ్ తింటారా..ఇప్పుడు కందుకూరులో జరిగిన ఘటనకు ఐస్ క్రీమ్ బండ్లు కారణంగా చెబుతున్నారు. ఒక్కసారి తోపులాట జరిగి ఐస్ క్రీమ్ బండి మీద పడటంతో కొందరు వాటి కింద నలిగి కొందరు చనిపోయారని చెబుతున్నారు.
ఇలా మాట్లాడటానికి కాస్తా అయిన టీడీపీ నాయకులకు సిగ్గు అనిపించడం లేదా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఓపెన్ డ్రైనేజీ కాల్వలు కావడంతో పక్కనే ఉన్న వాటిలో పడి కొందరు మరణించారని చెబుతున్నారు. తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు, ఆరుగురు పురుషులు మరణించారు. ఇక మీదనైనా చంద్రబాబు ఇరుకు రోడ్లలో కాకుండా మైదానాలలో సభలను ఏర్పాటు చేసుకుంటే మంచిదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!