Thirupathi : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ప్రసాదం అంటే కోట్లాది మంది భక్తులకు ఎంతో పరమ పవిత్రమైనది. అలాంటి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు.గత వైసీపీ ప్రభుత్వ హాయంలోనే భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ వ్యవహారం నడిచిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.వైసీపీ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు NDDB CALF ల్యాబ్ నిర్ధారించిన నివేదికలను టీడీపీ నేతలు తాజాగా బయటపెట్టారు. నివేదికల్లో పొందుపర్చిన అంశాలను ప్రస్తావిస్తూ.. మాజీ సీఎం జగన్‌పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
లడ్డుల్లో నెయ్యిపై జులై 8, 2024న ల్యాబ్‌కు పంపించగా.. జులై 17వ తేదీన NDDB CALF ల్యాబ్ నివేదిక ఇచ్చిందన్నారు.
దీంతో పెద్ద ఎత్తున దుమారం చేలరేగింది. అయితే ఈ ఇష్యూపై వైసీపీ నాయకులు ఘాటుగానే స్పందిస్తున్నారు. చంద్రబాబు హామీల అమల నుంచి తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతున్నారని, అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. తాజాగా దీనిపై టీటీడీ మాజీ చైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుమలపై ఏ రాజకీయ నాయకుడు చేయని వ్యాఖ్యలు చంద్రబాబు చేశారన్నారు.
చంద్రబాబు తన వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారని. టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో తిరుమల పవిత్రతను కాపాడామని చెప్పుకొచ్చారు. అలాగే తాను వెంకటేశ్వర స్వామి పాదాలచెంత ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని.. సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నారన్నారు. అలాగే సీఎం ఆరోపణలకు కట్టుబడి ఉంటే.. వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. అలాగే సీఎం చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే.. చట్టపరంగా, న్యాయపరంగా ముందుకు వెళ్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే NDDB CALF ల్యాబ్ నివేదిక ఇచ్చిన తేదీలపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ తేదీలను ఓసారి పరిశీలిస్తే కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జరిగినవిగా తెలుస్తోంది. దీంతో నేవేదికల్లో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయడానికి అయినా వారికి అధికారం ఉంటుంది. ఇది కాకుండా ప్రభుత్వంలోకి వచ్చిన 100 రోజుల తర్వాత ఇలాంటి ఆరోపణలు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని ఇట్టే తెలిసిపోతోంది. జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో విపరీతమైన ద్వేషాన్ని కలిగించడం అనేది టీడీపీ లక్ష్యం కావొచ్చు.. అందుకోసం వాళ్లకు అనేక మార్గాలుంటాయి. అంతే తప్ప.. దేవుడిని కూడా ఒక సాధనంలాగా వాడుకోవడం అనేది చాలా నీచం అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.