Home minister Anitha: తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. లడ్డూలో కల్తీ జరిగిందనే సీఎం చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలను నిరూపించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయింది. దీనికి తోడు లడ్డూ కల్తీ విషయం జరిగిందని చూపిస్తోన్న నివేదికలు తేదీలు రెండూ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించినవే కావడంతో కొత్త అనుమానాలు తెర మీదకు వచ్చాయి. సరిగ్గా ఈ సమయంలోనే జగన్ డిక్లరేషన్‌ను తెర మీదకు వచ్చారు.
జగన్ తిరుమల పర్యటన ప్రకటించిన దగ్గర నుంచి జగన్ మతం గురించి విపరీతమైన చర్చ సాగేలా చేయడంలో ప్రభుత్వం సక్సెస్ అయింది. అయితే తన డిక్లరేషన్ కారణంగా లడ్డూ వివాదం పక్క దారి పట్టకూడదనే ఉద్దేశంతో జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేశారు. మరోవైపు జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకోవడంతో కూటమి నేతలు ఆయపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. హోంమంత్రి అనిత ఓ అడుగు ముందుకేసి జగన్ తాను హిందువనని చెప్పుకోలేరని, ఆయన తిరుమల లడ్డూ ఎప్పుడైనా తిన్నారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై వైసీపీ సోషల్ మీడియా ఆమెకు కౌంటరిస్తూ వీడియోలు పెడుతున్నారు. జగన్ తిరుమల వెళ్లిన వీడియోలతో పాటు, ఆయన లడ్డూ తింటున్న వీడియోలను పోస్ట్ చేస్తూ అనితకు కౌంటరిస్తున్నారు.
ఒకప్పుడు ఆమె ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ..తాను క్రిస్టియన్ అని, తన బ్యాగులో ఎప్పుడు బైబిల్ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడేమో తాను హిందువనని మాట మార్చడం జరిగింది. దీంతో హోం మంత్రి అనిత తిరుమలకు వెళ్ళినపుడు డిక్లరేషన్ ఇచ్చారా లేదా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. వైసీపీ నేతలు సైతం ఇదే ప్రశ్నిస్తున్నారు. ఆమెకు గతంలో టీడీపీ బోర్డులో మెంబర్ షిప్ ఎందుకు ఇవ్వలేకపోయారని వైసీపీ నాయకులు హోంమంత్రి అనితను ప్రశ్నిస్తున్నారు. ఆమె స్వయంగా తాను క్రిస్టియన్ అని చెప్పిన విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. తన ఇంట్లో, కారులో, చేతిలో ఎప్పుడూ బైబిల్ ఉంటుందని అనిత చెప్పడం జరిగింది. దీంతో డిక్లరేషన్ విషయంలో జగన్‌ను ఇబ్బంది పెట్టాలని చూసి అనితనే అడ్డంగా బుక్ అయిందని వైసీపీ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు.