GOOSEBUMPS BREAKING NEWS: రాజకీయాల్లో గెలుపోటములు ఎవరికైనా సర్వసాధారణమే కానీ గెలిచాక ప్రజలకి ఏం చేస్తున్నారు అనేదే ముఖ్యం. ఓటు వేసి గెలిపించిన ప్రజలు ఎదురు చూసేది కూడా ఇందుకోసమే. అధికారంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించడానికి ఎన్నికల ముందు ఎనలేని హామీల వర్షం కురిపించి మరీ అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ సిక్స్ అనీ రాష్ట్ర రూపురేఖలని మార్చేసి దేశంలోనే ఏపీని నెంబర్ వన్ గా నిలబెడతామని వరుస హామీలు ఇచ్చారు ప్రజలకి. సీఎంగా ఉన్న జగన్ ఆంధ్రప్రదేశ్ ని బీహార్ మరియు శ్రీలంక లాగా మార్చేశాడని విపరీతమైన ఆరోపణలు చేసి మరీ అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు నాలుగు నెలలు దాటినా కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వానికి ప్రస్తుతం అగ్ని పరీక్ష జరుగుతుంది అని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలని అమలు చేయలేమంటూ ఇటీవల చంద్రబాబు నాయుడు చేతులెత్తేయడమే ఇందుకు కారణమని వారు అంటున్నారు. 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడికి ప్రజలు ఇచ్చిన చివరి అవకాశమే అనుకోవచ్చు ఇది. అలాంటప్పుడు ఇచ్చిన హామీలని నెరవేర్చి ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకోకపోతే ఇక మళ్ళీ ప్రజలు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉండబోదని వారు అంటున్నారు. ఖజానాలో డబ్బులు లేవని ఏవేవో చెప్పి ఇచ్చిన హామీలని నెరవేర్చకుండా తప్పించుకోవాలని కూటమి ప్రభుత్వం చూస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయలేనివి అని మిమ్మల్ని బురిడీ కొట్టించే ప్రయత్న౦ చేస్తున్నాడని ఎన్నికల ముందు జగన్ చెప్పినా ఆయన్ని నమ్మకుండా చంద్రబాబుని నమ్మి ఓట్లు వేసి ప్రజలు ఇప్పుడు మోసపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అంటున్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని నెరవేర్చే పరిస్థితి లేదని చంద్రబాబు చేతులెత్తేయడం మరియు పవన్ కళ్యాణ్ ఏ అంశం పైన కూడా సరిగ్గా స్పందించకపోవడంతో కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చిందని అంటున్నారు. గతంలో లాగే చంద్రబాబు వల్ల మళ్ళీ ఇప్పుడు కూడా మోసపోయినట్లు ప్రజలు భావిస్తున్నారని అంటున్నారు. ఈవీఎంల గోల్ మాల్ వల్లనో లేకపోతే ఎల్లో మీడియా దుష్ప్రచారాల వల్లనో ఎన్నికల ముందు ఇచ్చిన హామీల వర్షమో కానీ ప్రస్తుతం చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ అయితే అధికారంలోకి వచ్చారు. ఇచ్చిన హామీలని అమలు చేయకుండా ఇలాగే కాలం గడుపుదామని కూటమి ప్రభుత్వం భావిస్తుంటే ప్రజలు ఇంకా మోసపోయే పరిస్థితి లేదని ఇప్పటికే ప్రభుత్వం పట్ల చాలా వ్యతిరేకత ఉందని ప్రతిపక్షాలు అంటున్నాయి. మరోవైపు తీవ్ర ఓటమి పాలైన జగన్ అడుగు బయట పెట్టిన ప్రతిసారీ విపరీతమైన ప్రజాదరణ లభిస్తోంది. ప్రభుత్వం ఇలాగే ప్రజలని మోసం చేస్తే ప్రజలు ఇక ఊరుకోరని ప్రభుత్వాన్ని ది౦చేసే ప్రయత్నం చేస్తారనడంలో అతిశయోక్తి లేదని ఒకవేళ అదే జరిగితే మళ్ళీ జగనే కచ్చితంగా సీఎం అవుతాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిప్రాయ పడుతున్నారు.