Jagan-Modi: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డు ప్రసాద వివాదం రాజకీయ రంగు పులుముకుంది. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు.గత వైసీపీ ప్రభుత్వ హాయంలోనే భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ వ్యవహారం నడిచిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో పెద్ద ఎత్తున దుమారం చేలరేగింది.చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ సైతం ఘాటుగానే రియాక్ట్ అయింది. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.
సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నారన్నారు. అలాగే సీఎం ఆరోపణలకు కట్టుబడి ఉంటే.. వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఇదే సమయంలో ఈ వివాదంపై కోర్టు తలుపులు సైతం తట్టింది వైసీపీ. ఈ అంశం తేల్చేందుకు సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. శ్రీవారి ప్రసాదంలో జంతువుల ఫ్యాట్ కలిపారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జితో లేదా హైకోర్టు కమిటీ తో విచారణ చేయాలని కోరారు. సీబీఐతో విచారణ చేయించాలని..నిజం నిగ్గు తేల్చాలని పిటీషన్‌లో కోరింది వైసీపీ. ఈ పిటిషన్ పై వచ్చే బుధవారం విచారణ చేస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఇక ఈ వివాదంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సైతం స్పందించారు. శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన జగన్, లడ్డు ప్రసాద వివాదంపై క్లారిటీ ఇచ్చారు. 100 రోజుల పాలనపై చర్చ జరగకుండా ఉండేందుకే కల్తీ నెయ్యి వ్యవహారానికి తెరపైకి తీసుకొచ్చారని, అదంతా ఓ కట్టుకథ అని ఆయన కొట్టిపారేశారు. అయితే లడ్డూ వివాదంపై ప్రధాని మోదీ ఎటువంటి ప్రకటన చేయలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదని తేలియడంతోనే ప్రధాని ఈ ఘటనపై స్పందించలేదని తెలుస్తోంది.
అన్ని తెలుసుకున్న తర్వాతే లడ్డూ వివాదంపై మోదీ రియాక్ట్ కాలేదని, ఈ విషయంలో జగన్‌కే మోదీ పరోక్షంగా మద్దతిచ్చారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అటు జగన్ సైతం దీనిపై సీబీఐ, సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయమని కోరడంతో ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. తిరుమల లడ్డు ప్రసాద వివాదంపై వైసీపీ రియాక్ట్ అయిన తీరును చూస్తుంటే, ఈ ఆరోపణల్లో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాలని వారు గట్టిగానే కోరుతున్నట్టు స్పష్టం అవుతోంది. ఇంకా చెప్పాలంటే అధికార పార్టీకి ఎక్కడా కూడా తావు ఇవ్వకుండా సీబీఐ విచారణ కోరడం, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం వంటి అంశాలతో వైసీపీ సైతం దూకుడుగానే వ్యవహరిస్తోంది.