Friday, October 4, 2024

RK Roja: క్లారిటీ ఇచ్చేసిన ఆర్కే రోజా.. వైసీపీని వీడతారనే ప్రచారానికి అడ్డుకట్ట!

- Advertisement -

RK Roja: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఓ ఆసక్తికర చర్చ తెర మీదికి వచ్చింది. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి, ఆర్కే రోజా వైసీపీని విడిచి వెళ్తారనే వార్త తెగ చక్కర్లు కొట్టింది. తమిళనాడులో ప్రముఖ హీరో దళపతి విజయ్ కొత్తగా స్థాపించిన పార్టీలో ఆమె చేరతారని, అందుకే ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత రోజా సైలెంట్ అయ్యారనే ప్రచారం విపరీతంగా ఊపందుకుంది. ఇప్పుడు ఈ విషయమై క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇందుకు కారణం.. తాజాగా తిరుపతి జిల్లా నేతలతో వైసీపీ అధినేత జగన్ ఏర్పాటు చేసిన కీలక సమావేశం గురించి రోజా తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడమే. దీంతో రోజా వైసీపీని వీడతారనే ప్రచారానికి ఒక అడ్డుకట్ట పడినట్లు అయింది.

ఇదిలా ఉండగా.. గత కొన్ని రోజులుగా వైసీపీలో జరుగుతున్న కీలక పరిణామాలపై, పార్టీ ఫిరాయింపులపై ఎక్కడా స్పందించని రోజా.. ఇప్పుడిప్పుడే మళ్లీ క్రియాశీల రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇటీవలే వైఎస్ జగన్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పడం ద్వారా కూడా పార్టీతో సత్సంబంధాలే కొనసాగుతున్నాయని చెప్పకనే చెప్పేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలివెళ్లిన ఏ నాయకుడినైనా వైసీపీ శ్రేణులు ఖచ్చితంగా తిరస్కరిస్తాయని ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ క్రమంలోనే తాజాగా తిరుపతి జిల్లా వైసీపీ నేతలతో తాడేపల్లిలో జగన్ నిర్వహించిన సమీక్షలో రోజా పాల్గొనడం మాత్రమే కాకుండా జిల్లాలో పార్టీ పరిస్థితిపై జగన్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి సంబంధించి ‘ఎక్స్’ వేదికగా పంచుకున్న రోజా జగన్‌తో దిగిన ఫోటోను కూడా పోస్ట్ చేశారు. ఈ పరిణామంతో వైసీపీలో తన రాజకీయ భవితవ్యంపై రోజా పూర్తిగా క్లారిటీ ఇచ్చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!