Sunday, September 8, 2024

Ys jagan : అదీ వైఎస్ జగన్ విజన్ అంటే!

- Advertisement -

Ys jagan : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వలంటీర్లది ప్రధాన పాత్ర. నాలుగున్నరేళ్లకు పైగా పలు సహాయక చర్యల్లో కీలకంగా వ్యవహరించిన ఘనత వలంటీర్లది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాడు వైఎస్ జగన్‌ హయాంలో వరద విపత్తుల సమయంలో వలంటీర్లు పోషించిన పాత్ర మరువలేం. వరద పరిస్థితిని అంచనా వేయడం, ఏదైనా సమస్య తలెత్తితే సంబంధిత అధికారులకు సమాచారం చేరవేయడంలో వలంటీర్లు చురుగ్గా పాల్గొనేవారు. భుజంలోతు వరద నీరు వచ్చినా ప్రాణాలకు తెగించి బాధితుల ఇళ్ల వరకు వెళ్లి నిత్యావసరాలు అందించేవారు. అలాంటి వలంటీర్లను టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పక్కన పెట్టేసింది. మొత్తానికి పరిస్థితిని అంచనా వేసిన కొందరు అధికారుల సూచనల మేరకు చంద్రబాబు మళ్లీ వలంటీర్లను వరద సహాయక చర్యల్లో భాగస్వాములను చేశారు. కానీ అవసరాన్ని బట్టే వలంటీర్లను ఇలా వాడుకుంటున్న ఘనత టీడీపీ కూటమి ప్రభుత్వానికే చెల్లిందని వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి.

గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వలంటీర్‌ వ్యవస్థను నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు మరోసారి తన బుద్ధిని నిరూపించుకున్నారు. అవసరం మేరకు వాడుకోవ‌డం.. తర్వాత వదిలించుకోవడంలో చంద్ర‌బాబుది అందె వేసిన చేయి. ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు వలంటీర్ల‌కు రూ.10వేలు జీతం ఇస్తామ‌ని చెప్పి అధికారంలోకి రాగానే వాళ్ల‌ను ప‌ట్టించుకోవ‌డం మానేశాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఎన్నిక‌ల ముందు మ‌న‌కు పంచాయ‌తీరాజ్, రెవెన్యూ, ఎమ్మార్వో, క‌లెక్ట‌ర్లు ఉండ‌గా వలంటీర్లు ఎందుకు అంటూ ప్ర‌శ్నించిన సంగతి తెలిసిందే. అలా చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఇప్పుడు అవ‌స‌రం రాగానే వలంటీర్ల‌ను ఉప‌యోగించుకున్నారు. విజ‌య‌వాడ వ‌ర‌ద ముంపు స‌హాయ‌క కార్య‌క్ర‌మాల్లో అవ‌స‌రం ఏర్ప‌డ‌డంతో ప్రస్తుతం పదేపదే వలంటీర్ల జ‌పం చేస్తున్నారు. మరి ఇంత కన్నా సాక్ష్యం ఏం కావాలి? వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విజ‌న్ ఎలా ఉంటుందో చెప్పడానికి.. అదే ఇప్పుడు మరోసారి స్పష్టమైందని వైసీపీ చెబుతోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!