BIG BREAKING : ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు జగన్ ను అధికారం నుంచి దించడమే కాకుండా త్వరలోనే ఆయనతో పాటు శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకున్న వైసీపీలోని కొందరు నాయకులను ఈ రాష్ట్రం నుండి తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, వాళ్ళు చేసిన పాపాలు అలాంటివి అని వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ పై విరుచుకుపడ్డారు. మీరు అడగాల్సిన ప్రశ్నలు మరియు తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై అడగవలసిన విషయాలను మీ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని అడగకుండా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాస్తే ఏం ప్రయోజనం ఏముంటుందని ఆయన మాజీ సీఎం జగన్ ను ప్రశ్నించారు. తిరుమల శ్రీవారి లడ్డూల తయారీ కోసం కల్తీ నెయ్యి ఉపయోగించారా లేదా అనే విషయంపై జగన్ తో పాటు వైసీపీ నాయకులు శ్రీవారి భక్తులకు స్పష్టమైన క్లారిటీ ఇవ్వడం లేదని జీవీ ఆంజనేయులు ఆరోపించారు.
తిరుమల లడ్డూల కల్తీ నెయ్యి విషయం బయటపడిందని భయపడుతున్న జగన్ మరియు వైసీపీ నాయకులు ఇప్పుడు కావాలనే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పై ఎదురు దాడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మీ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి ఎంత దైవ భక్తి ఉందో ఈ దేశం మొత్తం తెలుసని ఇక మీ వీర విధేయుడు భూమన కరుణాకర్ రెడ్డికి ఎంత స్వామి భక్తి ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసని, వాళ్లు చేసిన పనులు అలాంటివని ఆయన జగన్ ను ఉద్దేశించి వ్యంగ్యంగా అన్నారు. మీ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి తప్పు చేయకపోతే విజిలెన్స్ విచారణకు సహకరించాలని అలా కాకుండా విజిలెన్స్ విచారణ రద్దు చేయాలని ఎందుకు హైకోర్టును ఆశ్రయించారని ఆయన జగన్ ను ప్రశ్నించారు. విజిలెన్స్ విచారణలో చిక్కిపోతామనే భయంతోనే వైవీ సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని ఆయన ఆరోపించారు. ఏమీ తెలియని అమాయకుడి లాగా ఈరోజు మీడియా ముందుకు వచ్చిన తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడటం వింటుంటే తిరుపతి ప్రజలు మండి పడుతున్నారని ఆయన అన్నారు. తిరుమల శ్రీవారికి వైవీ సుబ్బారెడ్డి మరియు భూమన కరుణాకర్ రెడ్డి ఎంత సేవ చేశారు అనే విషయంలో కల్తీ నెయ్యి వ్యవహారం అద్దంపడుతోందని ఆయన ఆరోపించారు.
గత ఐదు సంవత్సరాలలో క్రిమినల్ బ్యాచ్ మొత్తం తిరుమల శ్రీవారి ఆలయంలో ఏం చేసిందో తలుచుకుంటేనే భయమేస్తుందని, అది ఊహించడానికే తమకు మరియు శ్రీవారి భక్తులకు చాలా కష్టంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో జగన్ పాపాల పుట్ట పగిలిపోయి అన్ని బయటకు వస్తాయని, ఆ రోజు ప్రజల మీకు సరైన బుద్ధి చెబుతారని, జగన్ కు మరో యమగండం త్వరలోనే ఎదురవుతుందని ఆయన టీటీడీ మాజీ చైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డితో పాటు వైసీపీ నాయకులను హెచ్చరించారు. అసలు టీటీడీ ఈవో శ్యామల రావు ఆ ట్యా౦కర్లను వెనక్కి పంపించేశామని చెబుతుంటే చంద్రబాబు కావాలనే ఆ నెయ్యి వాడి లడ్డూలని కల్తీ చేశారని వ్యాఖ్యానించడం సరి కాదని వైసీపీ నాయకులు మండిపడ్డారు. ఒకవేళ నిజ౦గా సిట్ దర్యాప్తులో నిజానిజాలు బయట పడితే యమగండం జగన్ కి కాదని అసలైన యమగండం చంద్రబాబుకి అని వారు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.