Saturday, May 18, 2024

య‌న‌మ‌ల సంచలనన ఆడియో లీక్ ..తమ్ముడుతోనే వైరం జగన్ దెబ్బకు య‌న‌మ‌ల విలవిల

- Advertisement -

జగన్ దెబ్బకు య‌న‌మ‌ల విలవిల..తమ్ముడుతోనే వైరం

యనమల రామకృష్ణుడు రాజకీయాల్లో పెద్దగా పరిచియం అక్కర్లేని పేరు. దాదాపు నాలుగు దశబ్దాలుగా రాజకీయల్లో కొనసాగుతున్నారు యనమల రామకృష్ణుడు. ఆయన మొదటి నుంచి కూడా టీడీపీ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన కొత్తలోనే యనమల రామకృష్ణుడు టీడీపీలో చేరారు. చంద్రబాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పోడిచిన సందార్భంలో యనమల బాబుగారుకే తన మద్దతు తెలిపారు. యనమల రామకృష్ణుడు మొదటి నుంచి చంద్రబాబకు నమ్మకస్తుడుగానే ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా యనమలకు మంత్రి పదవి దక్కేది. టీడీపీ నాయకుల్లో యనమల చాలా ముఖ్యులు. అనేక మార్లు ఎమ్మెల్యే.. ఎంపీగా విజయాలు సాధించారు యనమల రామకృష్ణుడు. తూర్పు గోదావరి జిల్లా తూని నియోజిక వర్గం నుంచి ప్రతినిథ్యం వహించేవారు యనమల.

ఆ నియోజిక వర్గం నుంచే ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించరాయన. తూర్పు గోదావరి జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన నేత . మరి అలాంటి నేత ప్రస్తుతం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి రోజులను ఎప్పుడు కూడా యనమల రామకృష్ణుడు ఫేస్ చేయలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు యనమల రామకృష్ణుడు ప్రత్యక్ష రాజకీయల నుంచి తప్పుకుని చాలకాలం అయింది. 2009లో వైఎస్ఆర్ దెబ్బతో యనమల రామకృష్ణుడు తూనిలో ఘోరంగా ఓడిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసింది లేదు.

కాని ఆయన స్థానంలో యనమల తమ్ముడు యనమల కృష్ణుడు తూని నియోజిక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మూడుసార్టు పోటీ చేసినప్పటికి కూడా యనమల తన తమ్ముడును గెలిపించుకోలేకపోయారు. 2009,2014,2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తూని నియోజికవర్గంలో వైసీపీ అభ్యర్థే గెలవడం విశేషం. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో యనమల రామకృష్ణుడుకు ఎమ్మెల్సీని ఇచ్చి మంత్రి అప్పగించారు చంద్రబాబు. మంత్రిగా ఉండి కూడా తన తమ్ముడును గెలిపించుకోలేపోయారు యనమల. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినప్పటికి కూడా యనమల నియోజిక వర్గానికి ఏం చేయలేకపోయారని ప్రజలు ఆయనపై ఆగ్రహంగా ఉన్నారట. ఆ కారణంతోనే యనమల తమ్ముడుకు ప్రజలు ఓటు వేయడం లేదని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో తమ్ముడును కాదని తన కూతురును రంగంలోకి దించాలని చూస్తున్నారు. ఆయన స్థానంలో యనమల రామకృష్ణుడి కుమార్తెకు ఇవ్వాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు అధినాయకత్వంతో యనమల మాట్లాడినట్లు కూడా తెలుస్తోంది. తన సోదరుడిని వచ్చే ఎన్నికలకు దూరంగా ఉంచాలని ఆయన భావిస్తున్నారు. అయితే ఇది యనమల కృష్ణుడికి ఇది రుచించడం లేదు. తన సోదరుడు కుమార్తె కోసం తన రాజకీయ భవిష్యత్ ను దెబ్బతీస్తున్నాడని భావిస్తున్నారు. మూడు సార్లు ఓటమి పాలయ్యానన్న కారణంతో తనను పక్కన పెట్టి తన కుమార్తెకు సీటు ఇప్పించుకోవాలని టీడీపీ హైకమాండ్ వద్ద యనమల రామకృష్ణుడు వత్తిడి తెస్తున్నారని కృష్ణుడు భావిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే యనమల కృష్ణుడు చేసిన ఫోన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రతి గ్రామం నుంచి నలభై మంది రావాలని యనమల కృష్ణుడు కోరారు. తాను లేకుంటే తునిలో టీడీపీయే లేదని తన అన్నకు చెప్పాలంటూ ఆయన ఫోన్ చేసిన తీరు ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. తునిలో తాను ఓటమి పాలయినా నాలుగేళ్ల నుంచి పార్టీని రక్షించుకుంటూ వస్తున్నానని, కార్యకర్తలకు అండగా నిలుస్తున్నానని, అది విస్మరించి వేరే వారికి సీటు ఇస్తే అంగీకరించేది లేదని యనమల కృష్ణుడు ఫోన్‌లో మాట్లాడిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది ఇప్పుడు టీడీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఒకే ఇంట్లో నాయకులు ఇప్పుడు ఇలా రోడ్డున పడి కొట్టుకోవడంతో అధికార వైసీపీ పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ కొట్టిన దెబ్బకు క్రియశీల రాజకీయాలకు గుడ్ బై చెప్పిన యనమల… ఇప్పుడు ఆయన తనయుడు జగన్ కొట్టిన దెబ్బకు విలవిలలాడుతున్నారని ప్రత్యర్థులు ఆయన్ను ఎద్దెవా చేస్తున్నారు. మరి యనమల రామకృష్ణుడు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారో లేదో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!