Tuesday, September 10, 2024

మంత్రి బొత్సకు బిగ్ షాక్… సంచలన కామెంట్స్ చేసిన కీలక అనుచరుడు

- Advertisement -

వైసీపీ కీలక నేతలలో బొత్స సత్యనారాయణ కూడా ఒకరు. ఆయన వైసీపీ స్థాపించినప్పటి నుంచి పార్టీలో లేకపోయినప్పటికి కూడా 2014 ఎన్నికల తరువాత పార్టీలో చేరి క్రియశీలకంగా మారారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అనుచరుడుగానే బొత్స రాజకీయాల్లో ఎదిగారు. వైఎస్ఆర్ సీఎం అయిన రెండుసార్లు కూడా ఆయనకు మంత్రి పదవిని అప్పగించారు. వైఎస్ఆర్ మరణం తరువాత ఆయన తనయుడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంతంగా స్థాపించిన సమయంలో బొత్స మాత్రం కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. ఆ సమయంలో బొత్స వైఎస్ ఫ్యామిలీ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేకపోవడంతో… 2014 ఎన్నికల తరువాత వైసీపీలో చేరారాయన.

2019 ఎన్నికల్లో విజయం సాధించి.. మంత్రి కూడా అయ్యారు. మంత్రివర్గ పున:వ్యవస్థీకరణలో కూడా మరోమారు మంత్రిగా చోటు దక్కించుకోగలిగారు. ఇదిలా ఉంటే తాజాగా బొత్స సత్యనారాయణ కీలక అనుచరుడైన గురాన అయ్యలు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించున్నానని ఆయన తెలిపారు. ఇన్నాళ్లు తాను బొత్స సత్యనారాయణ అండగా నిలిచానని..కాని ఇక మీదట తాను కూడా సొంతంగా రాజకీయాల్లో రాణించుకోవాలని భావిస్తున్నానని ఆయన తెలిపారు. ఈక్రమంలో ఆయన వైసీపీ సర్కార్ మీద కూడా విమర్శలు చేశారు. ఏపీలో పాలన బాలేదని అందుకే తాను.. బొత్స సత్యనారాయణ దూరంగా ఉంటున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. తాను త్వరలోనే జనసేన తీర్థం పుచ్చుకుంటున్నట్టు గురాన అయ్యలు వెల్లడించారు.

విజయనగరం జిల్లాలో గురాన అయ్యలు అనేక వ్యాపారాలు ఉన్నాయి. జిల్లాలో ప్రముఖ వ్యాపార వేత్తగా గురాన అయ్యలు పేరుగాంచారు. అలాంటి వ్యక్తి బొత్స సత్యనారాయణకు దూరం కావడం ఆయనకు రాజకీయంగా పెద్ద దెబ్బే అని అంటున్నారు. అయితే దీనిపై బొత్స వర్గం మాత్రం మరోలా స్పందిస్తోంది. గురాన అయ్యలు మొదటి నుంచి కూడా బొత్స సత్యనారాయణకు అనుచరుడు కాదని.. ఆయన గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజరాజ్యం పార్టీలో పని చేశారని.. బొత్స సత్యనారాయణ మంత్రి అయిన తరువాత ఆయన వ్యాపార కార్యకలాపాల కోసం తమ పంచన చేరారని బొత్స వర్గం చెబుతుంది. మరి గురాన అయ్యలుకు బొత్స సత్యనారాయణ ఎలా చెక్ పెడతారో చూడాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!