వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా చేసుకొని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ లు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు… తమకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ప్రజలను కోరుతున్నారు.. లోకేష్ కూడా తనకు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుకుంటున్నారు…
2014 ఎన్నికల తర్వాత లోకేష్ ఎమ్మెల్సీ ద్వారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్నారు… అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు… లోకేష్ దొడ్డిదారిన మంత్రి పదవి దక్కించుకున్నారని ఫైర్ బ్రాండ్ రోజా తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ విమర్శలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో తొలిసారి లోకేష్ బాబు 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేశారు… కానీ ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు…
ప్రస్తుతం లోకేష్ గురించి ఇలాంటి వార్తే వైరల్ అవుతోంది త్వరలో లోకేష్ ఏపీవ్యాప్తంగా పాదయాత్ర చేయనున్న సంగతి తెలిసిందే… ఈ పాదయాత్రలో ఆయన టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేయనున్నారు…. అయితే తన గెలుపుకే దిక్కులేని లోకేష్ పాదయాత్ర ద్వారా టీడీపీ అభ్యర్థులను వచ్చే ఎన్నికల్లో ఎలా గెలిపిస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి.. ఆయన మంగళగిరిలో గెలిచి.. ఆ తర్వాత అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలను లోకేష్ బాబు ఎలా ఎదుర్కొంటారో చూడాలి… కాగా మంగళగిరిలో వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది అక్కడ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటారనే పేరును ఘటించారు… ఈసారి కూడా ఆయన గెలుపు నల్లేరు మీద నడికే అని అంటున్నారు రాజకీయ పండితులు… మరి లోకేష్ రామకృష్ణారెడ్డిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి….