జగన్ పాలనతో పాటు, ఆయన క్యాబినెట్‌పై దారుణమైన కామెంట్స్ చేశారు ఓ వైసీపీ ఎమ్మెల్యే తండ్రి. ఇంతటి దారుణాన్ని ఎక్కడ కూడా చూడలేదంటూ చెప్పుకొచ్చారు. ఇంతకి జగన్ పాలనతో పాటు, ఏపీ క్యాబినెట్ మీద కామెంట్స్ చేసిన వ్యక్తి ఎవరో తెలియలంటే.. ఈ మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు సామాజికవర్గంపై అధిపత్యం చలాయించాడానికే మొగ్గు చూపిస్తున్నారు. జగన్ సీఎం అయిన నాటి నుంచి కూడా కమ్మ సామాజికవర్గంను దూరం పెడుతునే ఉన్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వారికి ఎంత మేలు చేసినప్పటికి కూడా చివరికి ఆ సామాజికవర్గం వారు టీడీపీకి అండగా నిలబడతారని జగన్ గట్టిగా నమ్ముతున్నారు.
అందుకే ఆ సామాజికవర్గంపై పెద్దగా జగన్ ఆశలు పెట్టుకున్నట్లు కనిపించడం లేదు. తాజాగా జగన్ వ్యవహరిస్తున్న వ్యవహారశైలిపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు.. జగన్ మంత్రివర్గంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చినా స్పందించలేని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రజలుండటం బాధాకరమని వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రెడ్డి సామాజికవర్గానికి పెద్ద పీట వేస్తున్నారని…వారి పేరు మీద చాలా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, వైఎస్ఆర్ పేర్లతో అనేకం ఉన్నాయని వివరించారు. కానీ, ఏ ప్రభుత్వం వారి పేర్లను మార్చే ప్రయత్నం చేయలేదన్నారు.
కాని ప్రస్తుతం పాలనలో రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గం పైన రాజకీయంగా దాడి చేస్తున్నా ఎందుకు స్పందించటం లేదో అర్దం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఒక్క కమ్మ సామాజికవర్గానికి చెందిన మంత్రి కూడా లేకపోవడం దారుణం అని వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యనించారు. ఎంతకాలం వేరే వారి పల్లకిలు మోస్తారని కమ్మ సామాజికవర్గాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో అయిన సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరుకున్నారు. వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి.
ముఖ్యంగా వసంత నాగేశ్వరరావు చేసిన కామెంట్స్ ఆయన తనయుడు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. అసలు వచ్చే ఎన్నికల నాటికి వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీలో ఉంటారా అనే అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. దీనిపై ఆయన ఎలాంటి వివరణ ఇస్తారో అందరు కూడా అతృతుగా ఎదురు చూస్తున్నారు.