Ys jagan- Chandrababu: మాజీ సీఎం జగన్ కూటమి ప్రభత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు. చంద్రబాబు నిర్లక్ష్యంతో విజయవాడ మునిగిపోయింది. సహాయ చర్యల్లో ఆలస్యం, పునరావాస కేంద్రాల ప్రస్తావనే లేదు. బాధితులు నాలుగు రోజులుగా నీటిలో ఉండి అవస్థలు పడుతున్నారు. అధికారులు వస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నారున్నారు. రాజరాజేశ్వరి పేటలో పర్యటించిన జగన్ అక్కడ బాధితుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సమన్వయ లోపమైన ప్రభుత్వం ప్రజలను సమస్యల్లోకి నెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలు, ఇతరులు పర్యటించిన ప్రాంతాలపైనే దృష్టి పెడుతున్నారు తప్ప మిగతా వారిని పట్టించుకోవడం లేదని అన్నారు.
అసలు బాబుకు మనుషులంటేనే సులకన, తానే ఏం చేయాలనుకున్నా సొంత నిర్ణయం తీసుకోలేని పరిస్థితి, అటుగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ తమ లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా సమర్థించుకోవడం దారుణమని జగన్ అన్నారు. పర్యటనలో బాధితుల బాధలు తెలుసుకుంటుంటే రాజకీయాలు చేస్తున్నారంటూ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని కన్నెర్ర చేశారు. పరిష్కార మార్గాన్ని పక్కన పెట్టి ఎవరు ఎంత ఇస్తారో, ఎలా ఇస్తారో అన్న ధ్యాసే తప్ప ముందుకొచ్చి పరిస్థితిని సక్క దిద్దే దాఖలాలే లేవని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అయిందిఅని కాదు, ప్రజల కోసం ఏం చేస్తున్నారన్నదే ముఖ్యం. తక్కువ టైమ్ లోనే కూటమి పాలనలో చిత్ర విచిత్రాలు బయట పడుతున్నాయని జగన్ అన్నారు. బాధితుల ఘోసను మర్పించేందుకు బడమనేరు పేరుతో కొత్త సమస్యను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ అక్రమాలు జరిగాయని ఎలా చెప్తారని మండిపడ్డారు. అక్కడ పరిస్థితి బట్టి ఇండ్లు ఇచ్చామన్నారు. బడమనేరు గేట్లు ఎత్తి తన సొంతింటి కాపాడుకోవడం కోసమే ప్రజల ప్రాణాలను బలి చేశారని… ఇది చంద్రబాబుకు కొత్తేమీ కాదని…. గతంలో పుష్కరాల్లో కూడా ప్రాణ నష్టానికి బాబు బాధ్యడయ్యారని గుర్తు చేశారు. విపక్షాలు, ప్రతిపక్షాలు మాట్లాడే మాటలపైన సమీక్షలు జరపడం ఆపి వరద బాధితులకు నాణ్యమైన పరిష్కారం అందేలా చూడాలని మాజీ సీఎం జగన్ ధ్వజమెత్తారు, మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
————— పట్ట. హరిప్రసాద్ ——————————-