Saturday, October 5, 2024

మంగళగిరికి లోకేష్ గుడ్ బై ఈసారి పోటీ అక్కడి నుండే

- Advertisement -

టీడీపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుండి కాకుండా వేరే సెగ్మెంట్ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి… గత ఎన్నికల్లో ఈ సెగ్మెంట్ నుంచి లోకేష్ పోటీ చేసి ఓటమి చెందిన సంగతి తెలిసిందే… అయితే ఈసారి కూడా ఓటమి భయంతోనే వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. అందుకు కారణం ఇక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటం… తన దగ్గరకు వచ్చిన ప్రతి సమస్యను పరిష్కారం చూపుతుండటంతో ప్రజలు రామకృష్ణారెడ్డి వెంట ఉన్నారు.. ఇటీవలే కొంతమంది టీడీపీ కీలక నాయకులు సైతం ఆయనకు సపోర్టు చేస్తున్నారట… అందుకే ఈసారి మంగళగిరిలో టీడీపీ గెలవడం సాధ్యం కాదనే ఉద్దేశంతో లోకేష్ మరో నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు సిద్ధమవుతోన్నారని వార్తలు వస్తున్నాయి… తాజా సమాచారం ప్రకారం చిత్తూరు జిల్లా నుండి లోకేష్ పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం… చూడాలి ఈసారైనా లోకేష్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారా లేదా అనేది… కాగా ఈ జిల్లాలో 14 నియోజకవర్గాలకు గాను 2019 ఎన్నికల్లో కుప్పం మినహా మిగిలిన అన్ని స్థానాల్లో వైసీపీ జెండా ఎగిరిన సంగతి మనందరికీ తెలిసిందే…

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!