Sunday, September 8, 2024

సింగర్ మంగ్లీకి జగన్ బంపర్ ఆఫర్…ఏకంగా ఆ పదవిని ఇస్తూ ఉత్తర్వులు

- Advertisement -

నమ్ముకున్న వారిని అందలం ఎక్కించడంలో వైఎస్ ఫ్యామిలీ తరువాతే ఎవరైనా. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ద్వారా రాజకీయంగా చాలామంది ఎదిగారనే చెప్పాలి. రఘువీరా రెడ్డి, బొత్స సత్యనారయణ, కేవీపీ, సబితా ఇంద్రరెడ్డి, డీకే అరుణ, గీతారెడ్డి, కొండా సురేఖ మొదలగు వారందరు కూడా వైఎస్ ఇచ్చిన అండతోనే రాజకీయాల్లో రాణించారు. వైఎస్ మరణం తరువాత చాలామంది వేరు వేరు పార్టీలలో చేరినప్పటికి కూడా వైఎస్ఆర్‌ను తమ అభిమాన గురువుగానే భావిస్తుంటారు. తన తండ్రి మాదిరిగానే తమను నమ్ముకున్న వారికి ఉన్నత పదవులు అప్పగిస్తున్నారు జగన్. రాజకీయంగా తన వెంట నడిచిన వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టింది లేదు. రాజకీయంగా ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులను కూడా జగన్ ఎంపీలుగా గెలిపించారు. తాజాగా దీనిని మరోసారి నిరుపితం చేశారు వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్. సింగర్ మంగ్లీకి ఎవరు ఊహించని పదవి ఇచ్చి అందరికి షాక్ ఇచ్చారాయన. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తనదైన పాటలతో అశేష అభిమానులను సొంతం చేసుకున్న సింగర్స్‌లో కూడా మంగ్లీ కూడా ఒకరు. ముఖ్యంగా తెలంగాణకు చెందిన పాటలు పాడుతూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె. తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుపుకొనే బతుకమ్మ, సమ్మక్కసారక, బోనాల ఉత్సవాలపై మంగ్లీ చేసిన మ్యూజిక్ ఆల్బమ్స్ ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆయా పండగల సమయాల్లో మంగ్లీ పాడిన పాటలు గ్రామగ్రామాన వినిపిస్తుంటాయి. ఇటీవల కాలంలో సినిమా పాటలు కూడా పాడుతూ మంగ్లీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా సింగర్ మంగ్లీకి TTDలో ఉన్నత పదవిని ఇస్తూ వైసీపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఛానెల్ సలహాదారుగా మంగ్లీని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాలుగు రోజుల కిందటే మంగ్లీ ఈ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంత్రి రోజాతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఈ పదవి లభించిందనే ప్రచారం ఉంది. ఇదిలా ఉంటే మంగ్లీది లంబాడీ సామాజిక వర్గం. తమ సామాజిక వర్గానికి మహిళను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నత స్థానంలో కూర్చోబెట్టినట్టయిందని ఆ సామాజికవర్గం వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక మంగ్లీ విషయానికి వస్తే…ఆమె గతంలో జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీకి కొన్ని పాటలు పాడారు. యలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. తూరుపు దిక్కున భానుడు లేచే.. వంటి పాటలు ఇప్పటికీ వైసీపీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తునే ఉన్నాయి. తొలిసారి ప్రభుత్వం తరుఫున పదవి రావడంతో మంగ్లీ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌కు ఎప్పటికి రుణపడి ఉంటానని ఆమె తెలిపారు. ఇదిలా ఉంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఛానెల్ సలహాదారులుగా ఆమెకు నెలకు లక్ష రూపాయిల జీతంగా తెలుస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!