అఖిల ప్రియకు బిగ్ షాకిచ్చిన చంద్రబాబు.. ఆమె మొహం చూడటానికి కూడా ఇష్టపడని టీడీపీ అధినేత
టీడీపీ మహిళ నేత, మాజీ మంత్రి అయిన భూమా అఖిల ప్రియ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే వరుస సమస్యలతో సతమతం అవుతున్న భూమా అఖిల ప్రియకు సొంత పార్టీ నేతలు కూడా షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆమె మొహం చూడటానికి కూడా టీడీపీ అధినేత ఇష్టపడలేదని సమాచారం అందుతుంది. తాజాగా చంద్రబాబు కర్నూల్ పర్యటనతో భూమా అఖిల ప్రియ రాజకీయం జీవితానికి తెర పడినట్లు అయిందని పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే…. భూమా అఖిల ప్రియ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోకి అనుహ్యంగా దూసుకువచ్చారు. ఆమె రాజకీయ జీవితమే విచిత్రంగా మొదలైంది.
తల్లి చనిపోతే .. ఎమ్మెల్యేగా..తండ్రి చనిపోతే మంత్రి అయ్యారు అఖిలప్రియ. వైసీపీ తరుఫున ఎమ్మెల్యేగా గెలిచి… తరువాత మంత్రి పదవి కోసం టీడీపీ కండువా కప్పుకున్నారు భూమా ఫ్యామిలీ. వైసీపీ అధినేత జగన్‌కు బంధువులు అయినప్పటికి కూడా ఆయన్ను చాలా దారుణంగా మోసం చేసి పార్టీని వీడారు. టీడీపీలో చేరినప్పుడే భూమా ఫ్యామిలీ పతనం మొదలైంది. మంత్రి పదవి రాలేదని బాధతో భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించారు. తండ్రి మరణం తరువాత భూమా అఖిలప్రియకు అనుహ్యంగా మంత్రి పదవి వచ్చింది. నంద్యాల ఉప ఎన్నిక విజయంతో ..అఖిలకు తల పొగరు మరింత ఎక్కువైందనే చెప్పాలి. తండ్రి తరువాత తండ్రింతటి వాడైన ఏవీ సుబ్బారెడ్డినే చంపించడానికి సుఫారీ ఇచ్చారు అఖిల ప్రియ.
ఇక రెండో వివాహం అనంతరం ఆమె మరింత దారుణంగా తయ్యారైయ్యారు. తన బంధువుల ఆస్తులపై కూడా ఆమె ఆశ పడ్డారంటే అఖిల ప్రియ ఎంత దారుణంగా మారారో అర్థం చేసుకోవచ్చు. ఓ కిడ్నాప్ కేసులో కూడా ఆమె జైలు జీవితం గడిపి వచ్చారు. పరిస్థుతులు చక్కబడ్డాయి అని అనుకునేలోపే… టీడీపీ అధినేత ఆమెకు మొండిచెయి చూపారని తెలుస్తోంది. ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటించినా అఖిలప్రియ కనిపించలేదు. అయితే దీనికి ముందు జరిగిన కొన్ని తీవ్ర పరిణమాలు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది.
తనని కలిసేందుకు వచ్చిన అఖిలప్రియను చూడగానే చంద్రబాబు మొహం మాడిపోయినట్లుగా పెట్టారట. ఎందుకొచ్చావ్? అంటూ అఖిలప్రియను నిలదీసినంత పని చంద్రబాబు చేశారని కర్నూలు నేతలు అంటున్నారు. కనీసం ఫొటో తీసుకుందామని అఖిలప్రియ ప్రయత్నించినప్పటికి కూడా చంద్రబాబు అందుకు సిద్దంగా లేకపోవడంతో అక్కడ నుంచి మెల్లగా ఆమె జారుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనతో అఖిలప్రియ అవమానానికి గురయ్యాననే భావనకు లోనైనట్టు తెలిసింది. దీనికి తోడు ఆమెకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది కూడా లేదని పార్టీ నేతలతో చంద్రబాబు చెప్పినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి.
తనది టికెట్ అడిగే స్థాయి కాదని, పది మందికి ఇప్పించే కెపాసిటీ అని ఇటీవల అఖిలప్రియ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కామెంట్స్ కూడా చంద్రబాబు ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ చూసిన వారంత కూడా అఖిత ప్రియ రాజకీయ జీవితం ముగిసిపోయినట్లే అని భావిస్తున్నారు. దీనిపై జగన్ అభిమానులైతే భిన్నంగా స్పందిస్తున్నారు. జగన్ ఇబ్బంది పెట్టిన వారు సుఖపడినట్లుగా చరిత్రలో లేదని.. జగన్‌ను మోసం చేస్తే ఇలానే ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి భూమా అఖిల ప్రియ జీవితంలో ఎలాంటి పరిణమామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.