Thursday, November 7, 2024

Vijayasai Reddy: ఓటమి బాధలో ఉన్న వైసీపీ కి బిగ్ బూస్ట్ ఇచ్చిన విజయసాయి రెడ్డి .. జగన్ కూడా ఊహించని సీన్ ఇది !

- Advertisement -

Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్‌లపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ సెటైర్లు వేశారు. ఇతరుల సంతోషాన్ని చూసి మీరిద్దరు ఓర్వలేక ఏడుస్తుంటారని విమర్శించారు. ఎక్స్‌ వేదికగా విజయసాయి రెడ్డి వీరిద్దరి గురించి వ్యంగ్యోక్తులు రాశారు. ‘నారద ముని ఒక రోజు శ్రీకృష్ణుడిని అడిగాడు. ‘ప్రభూ! చంద్రబాబు, అయన సుపుత్రుడు లోకేష్ ఎల్లప్పుడు దుఃఖంలో ఎందుకుంటారు?’ శ్రీకృష్ణుడు అద్భుత రీతిలో జవాబు ఇస్తూ, ‘ప్రతి మనిషికి ఆనందాలు ఉంటాయి. కానీ, చంద్రబాబు మరియు లోకేష్ లాంటి వారు ఇతరుల సంతోషాన్ని చూసి ఓర్వలేక దుఃఖిస్తుంటారు! ‘ అని విజయసాయి రెడ్డి ట్వీట్‌ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే దోపిడీ, మోసం, దగా అంటూ విజయసాయి రెడ్డి ఘాటుగా విమర్శించారు. సంపద సృష్టి లేదు, 40 ఏళ్ల అనుభవం లేదు, వంకాయ లేదు అంతా దోపిడీనే అని విజయసాయిరెడ్డి విమర్శించారు. మళ్లీ 3 వేల కోట్ల అప్పు చేశారని, ఈ డబ్బంతా ఎక్కడికి పోతుందని ఆయన ప్రశ్నించారు. కార్పొరేషన్‌కు గ్యారంటీ ఇచ్చి తెచ్చిన అప్పుతో కలిసి ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు తెచ్చిన అప్పు దాదాపు 50 వేల కోట్ల రూపాయలకు పై మాటే అని విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే నాటికి జీతాలు చెల్లించి ఖజానాలో ఉన్న డబ్బు దాదాపు ఏడు వేల కోట్లు అని అది కాకుండా కేంద్రం నుంచి వివిధ పద్దుల కింద వచ్చిన డబ్బు కూడా ఉందని విజయసాయి రెడ్డి అన్నారు. అయినప్పటికీ పిల్లలు తినే గోరు ముద్దతో సహా జగన్‌ 38 సంక్షేమ పథకాల్లో ఏ ఒక్కటీ చంద్రబాబు కొనసాగించలేదని, పాత బిల్లులు చెల్లించడం లేదని పేర్కొన్నారు.

విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు కూడా టీడీపీలోకి వస్తామంటూ రాయబారాలు పంపిస్తున్నారని అచ్చెన్న కామెంట్ చేశారు. ఈ అంశం గురించి కూడా విజయసాయి రెడ్డి స్పందించారు. తాను పార్టీ మారేది లేదని చెబుతూనే మంత్రి అచ్చెన్నాయుడిపై సెటైర్లతో మరో ట్వీట్ వేశారు విజయసాయి రెడ్డి. దేవుడు అచ్చెన్నాయుడిని పుట్టించేటప్పుడు మెదడు, బుద్ధి, జ్ఞానం 0.1 శాతం మాత్రమే ఇచ్చారని ఘాటుగా విమర్శించారు. చిన్నప్పుడు అచ్చెన్నాయుడు ఫ్రెండ్స్ ఆయన్ను అచ్చి.. బుచ్చి… కచ్చి… అని ఆట పట్టించే వారని కూడా చెప్పారు. దేహం పెరిగినట్టుగా మెదడు వృద్ధి చెందక పోవడం వల్ల ఆయన చేష్టలు, మాటలు అన్నీ వింతగా ఉంటాయని అన్నారు విజయసాయి రెడ్డి. ఆయన మోకాలికి బోడి గుండుకు లంకె పెడుతుంటారని తన విధేయత, కమిట్మెంట్, నిబద్ధతలపై అందుకే జోకులు పేలుస్తున్నారని చెప్పారు. టీడీపీ అనే కుల పార్టీలో చేరేందుకు తానెప్పుడూ ప్రయత్నించలేదన్నారు. దీంతో ఓటమి బాధలో ఉన్న వైసీపీ కి విజయసాయి రెడ్డి బిగ్ బూస్ట్ ఇచ్చారని ఈ సీన్ జగన్ కూడా ఊహించలేదని కూటమి ప్రభుత్వానికి విజయసాయి రెడ్డి సరైన సమాధానం ఇచ్చారని వైసీపీ కార్యకర్తలు అభిప్రాయ పడ్డారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!