Tuesday, September 10, 2024

బాలయ్యకు ఫ్లెక్సీ కట్టిన ఎమ్మెల్యే.. చీటి చిరిగినట్లేనా..?

- Advertisement -

సినిమాలు వేరు , రాజకీయాలు వేరు , కాని ఏపీలో మాత్రం రాజకీయాలు, సినిమాలు అన్ని కూడా కలిసే ఉంటాయి. సినిమాలకు , రాజకీయాలకు వీడదీయరాని సంబంధం ఉంది. సినిమాల నుంచి వచ్చే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. అధేవిధంగా చిరంజీవి, ప్రజరాజ్యం, ఆయన తమ్ముడు జనసేన, వంటి రాజకీయ పార్టీలు పెట్టారు. ఇక చాలామంది సినీ నటులు ఎమ్మెల్యేలుగా , ఎంపీలుగా పలు రాజకీయా పార్టీల ద్వారా ప్రజాప్రతినిధులుగా దర్శనం ఇచ్చారు. అయితే ఇప్పుడు ఏపీలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. రాజకీయ విస్పోటనం తారస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు ఢీ అంటే ఢీ అనే విధాంగా పోటీ పడుతున్నాయి.

ఇటువంటి తరుణంలో ఓ వైసీపీ ఎమ్మెల్యే కొడుకు .. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఫ్లెక్సీ కట్టడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ బాలయ్యకు ఫ్లెక్సీ కట్టిన ఆ ఎమ్మెల్యే కొడుకు ఎవరో తెలియాలంటే ఈ మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. వైసీపీ అధినేత జగనక కూడా ఒకప్పుడు బాలకృష్ణ అభిమానే అన్న సంగతి అందరికి తెలిసిందే. కడప జిల్లా బాలయ్య అభిమానుల సంఘానికి జగన్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. అయితే జగన్ రాజకీయాల్లో ఎంట్రీ అయిన తర్వాత మాత్రం బాలయ్యపై అభిమానం చూపలేదు. వైసీపీలో కూడా బాలయ్యను అభిమానించే వాళ్లు ఉన్నారనే సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా వైసీపీ ఎమ్మెల్యే కొడుకు తాజాగా బాలకృష్ణ నటించిన వీరాసింహారెడ్డి సినిమాకు సంబంధించి ఫ్లెక్సీ కట్టి కలకలం రేపారు.

ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే చెన్నకేశరెడ్డి కుమారుడు వీర ధరణి ధర్ రెడ్డి తాజాగా ఫ్లెక్సీని ఏర్పాటు చేయగా అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవైపు బాలయ్య ఉండగా మరోవైపు వీర ధరణి ధర్ రెడ్డి ఉన్నారు. రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యే అంటూ ఆయన ఫ్లెక్సీలో పేర్కొనడం గమనార్హం. అయితే వైసీపీ ఎమ్మెల్యే కొడుకు బాలకృష్ణకు అనుకూలంగా పబ్లిక్ గా ఈ విధంగా ప్రచారం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ కామెంట్ల గురించి ఎమ్మెల్యే కొడుకు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. వైసీపీ నేతలు ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూసుకుంటే మంచిదని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!