2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనంలో కూడా టీడీపీ 23 సీట్లలలో విజయం సాధించింది. అయితే వచ్చే ఎన్నికల్లో ఆ 23 సీట్లలో కూడా విజయం సాధించాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారు. దీనిలో భాగంగానే వై నాట్ 175 అనే నినాదాన్ని తెర మీదకు తీసుకువచ్చారాయన. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో విజయం సాధించడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. దీనిలో భాగంగానే గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన 23 సీట్లపై ముందుగా స్పెషల్ ఫోకస్ పెట్టారాయన. ఈ క్రమంలోనే జగన్ ముందుగా 2019 ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలపై స్థానాలపై గురి పెట్టారు. 2024 ఎన్నికల్లో తొలుత టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న చోట అభ్యర్థులను ఖారారు చేసుకుంటుపోతున్నారు.
2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన స్థానాల్లో ప్రకాశం జిల్లా అద్దంకి కూడా ఒకటి. 2014 ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గంలో వైసీపీనే గెలిచింది. వైసీపీ తరుఫున పోటీ చేసిన గొట్టిపాటి రవికుమార్… తరువాత జరిగిన రాజకీయ పరిణమాలతో ఆయన టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరుఫున పోటీ చేసి జగన్ ప్రభంజనంలో కూడా గొట్టిపాటి రవి కుమార్ విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ నాయకులు కలిసికట్టుగా పని చేయకపోవడంతోనే అక్కడ పార్టీ ఓడిపోయిందని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అద్దంకిలో వైసీపీకి బలమైన క్యాడర్ ఉంది.
దానికి తగినట్లుగా సరైన నాయకుడు ఉంటే కనుక అద్దంకిలో విజయం సాధించడం పెద్ద విషయం కాదని కార్యకర్తలు చెబుతున్నారు. ఈక్రమంలోనే 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బాచిన గరటయ్య, కుమారుడు బాచిన కృష్ణ చైతన్యను రంగంలోకి దించారు జగన్. వచ్చే ఎన్నికల్లో బాచిన కృష్ణ చైతన్యకు టికెట్ ఖారారు చేస్తూ జగన్ నిర్ణయం కూడా తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థుతుల్లో అద్దంకిలో వైసీపీ జెండా ఎగరాల్సిందే అని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈక్రమంలోనే బాచిన కృష్ణ చైతన్య నియోజకవర్గంలో నిత్యం పర్యటిస్తూ.. ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
బాచిన కృష్ణ చైతన్య చేపట్టిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. రోజు రోజుకు అద్దంకి నియోజకవర్గంలో బాచిన కృష్ణ చైతన్యకు క్రేజ్ పెరిగిపోతుంది. చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీతో విజయం సాధించిన ఆశ్చర్యపడాల్సిన పని లేదని ప్రత్యర్థులు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న బాచిన కృష్ణ చైతన్య రాజకీయ వ్యూహాలు, ఏత్తుగడలు, ఆలోచన విధానం, చురుకుగా తిరగడం, అభివృద్ది కార్యక్రమాలు నిర్వహిస్తు.. జనం లోనే ఉంటున్నారు. ట్రెండ్ చూస్తుంటే బాచినను తట్టుకోవడం గొట్టిపాటి వల్ల కాదని ఆయన సన్నిహితులే చెప్పడం విశేషం. అద్దంకిలో గెలుపు కష్టం అని భావించిన గొట్టిపాటి .. వచ్చే ఎన్నికల నాటికి మరొ నియోజకవర్గంలో పోటీ చేయలని చూస్తున్నారని విశ్వసనీయ సమాచారం. పర్చూరు గానీ చిలకలూరిపేట గానీ పోటీ చేస్తే ఎలా ఉంటుందని గొట్టిపాటి ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తనికి అద్దంకిలో ఇన్నాళ్లకు గొట్టిపాటికి చెక్ పెట్టే మొనగాడు వచ్చాడని నియోజకవర్గ ప్రజలు చర్చించుకోవడం విశేషం.