Monday, February 10, 2025

వైసీపీ శ్రేణుల కోసం మరో క్యాంపెయిన్!

- Advertisement -

రాష్ట్రంలో వైసిపి మరో కొత్త పోరాటానికి తెరతీసింది. ప్రత్యేక క్యాంపెయిన్ ప్రారంభించింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ శ్రేణులపై దాడులు పెరిగాయి. పెద్ద ఎత్తున కేసులు కూడా నమోదయ్యాయి. ఈ తరుణంలోనే వైసీపీ అధినేత జగన్ స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులపై.. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు, వారికి అండగా ఉండేందుకు వైసిపి నాయకులతో కమిటీలను ఏర్పాటు చేశారు. వారిని నేరుగా కలిసి ధైర్యం చెప్పేలా ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్రస్థాయిలో ఒక మానిటరింగ్ సిస్టం కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ కమిటీలు బాధితులను ఆదుకోవడంలో ముందు వరుసలో నిలిచాయి.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వైసిపి అనుకూల సోషల్ మీడియా కార్యకర్తలపై పెద్ద ఎత్తున కేసులు నమోదైన సంగతి తెలిసిందే. రెండు మూడు రోజుల వ్యవధిలోనే వందలాది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా గత ఐదేళ్లుగా వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వారిని టార్గెట్ చేసుకున్నారు. కొందరినైతే మఫ్టీ లో ఉన్న పోలీసులు తీసుకెళ్లారు. కనీసం ఎక్కడకు తీసుకెళ్లారో కూడా తెలియనివ్వలేదు. వారి కుటుంబాలు కోర్టులను ఆశ్రయిస్తే
… న్యాయస్థానాలు సైతం తక్షణం సమాచారం ఇవ్వాలని ఆదేశించాయి. ఆ ఆదేశాలు సైతం భేఖాతరు అయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో వైసిపి లీగల్ సెల్ ఎప్పటికప్పుడు స్పందించడంతో పోలీసులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

అయితే కూటమి దూకుడుకు కళ్లెం వేయాలని వైసీపీ అధినేత ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. గత ఐదేళ్లలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని జగన్ సర్కార్ పై విష ప్రచారం చేసింది కూటమి. అయితే జగన్ హయాంలో జరిగిన అభివృద్ధిపై సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో పెట్టాలని నాయకత్వం పిలుపుమేరకు.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు స్పందించాయి. ఇదిగో గ్రామాల్లో అభివృద్ధి అంటూ మూడు లక్షల వరకు వైసిపి శ్రేణులు.. తమ గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని కళ్లకు కట్టినట్లు చూపించారు. అప్పట్లో ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

అయితే ఇప్పుడు వైసీపీకి సోషల్ మీడియా ప్రధాన అస్త్రంగా మారింది. ఇందులో సామాన్య వైసిపి కార్యకర్త సైతం భాగస్వామ్యం అవుతున్నారు. ఈ తరుణంలో మరో క్యాంపెయిన్ కు సిద్ధపడింది వైసిపి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడితే వెంటనే సమాచారం ఇచ్చేలా.. పార్టీ శ్రేణులను అప్రమత్తం చేసేలా.. ఒక క్యాంపెయిన్ ను రూపొందించింది. ఎక్కడైనా దాడులతో పాటు కేసులు నమోదు చేస్తే తక్షణం సోషల్ మీడియాలో పెడితే.. వైసిపి లీగల్ టీం అక్కడకు చేరుకుంటుంది. బాధితులకు అండగా నిలబడుతుంది

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!