Monday, February 10, 2025

వైసీపీ నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఎలా బాబు.. సీనియార్టీ, సిన్సియారిటీ పై టిడిపి శ్రేణుల ఆగ్రహం!

- Advertisement -

చంద్రబాబు తీరుపై తెలుగుదేశం పార్టీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పార్టీలో కష్టపడే వారికి పదవులు అని చంద్రబాబు తేల్చి చెబుతున్నారు. ఇది మంచి పద్ధతి. కానీ గడిచిన ఎన్నికల్లో వైసీపీ నుంచి వచ్చిన వారికి ఎందుకు టిక్కెట్లు ఇచ్చారు? అలా గెలిచిన వారికి మంత్రి పదవులు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు టిడిపి నేతల నుంచి ఎదురవుతున్న ప్రశ్న ఇది. ఇటీవల పార్టీ శ్రేణుల విషయంలో కీలక ప్రకటనలు చేస్తున్నారు చంద్రబాబు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు కంటే.. తెలుగుదేశం పార్టీని నమ్ముకొని పనిచేసిన నాయకులను ప్రార్థించాలని చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. అయితే ఈ విషయంలో చంద్రబాబు పై అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. అయితే గత ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీని నమ్ముకుని.. వైసీపీ శ్రేణుల చేతుల్లో దాడులు, కేసులతో ఇబ్బంది పడిన తమ పరిస్థితి ఏంటని టిడిపి శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.

వాస్తవానికి ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టిడిపిలో చేరిన చాలామంది నేతలకు టిక్కెట్లు ఇచ్చారు చంద్రబాబు. తనకోసం ఎంతగానో కష్టించి పనిచేశారు మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. కానీ ఈ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ కోసం.. దేవినేని ఉమామహేశ్వరరావు ను పక్కన పెట్టారు. ఆయన ఒక్కడినే కాదు రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో సిట్టింగులకు పదవులు లేకుండా చేశారు. హుండీలో సిట్టింగ్ ఎమ్మెల్యే టిడిపికి ఉండగా.. ఆయన స్థానంలో రఘురామకృష్ణం రాజుకు టిక్కెట్ ఇవ్వడం దేనికి సంకేతం? ఆయన ఒక్కరినే కాదు చాలా నియోజకవర్గాల్లో పరిస్థితి అలానే ఉంది. జనసేనతో సీట్ల సర్దుబాటులో భాగంగా కొందరిని, వైసీపీ నుంచి టిడిపిలో చేరిన వారి కోసం మరికొందరిని చంద్రబాబు బలిపశువు చేశారు. కానీ తాను మాత్రం కుప్పం నుంచి, తన కుమారుడు మంగళగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. ఒకరు సీఎం అయ్యారు. మరొకరు మంత్రి అయ్యారు. కానీ ఇదే ఫార్ములా మాత్రం ఇతర టిడిపి నేతల విషయంలో అమలు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.

ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి. ఎన్నికల్లో గెలిచిన వెంటనే వారికి మంత్రి పదవులు ఇచ్చారు. కనీసం ఆయా జిల్లాల్లో మిగతా టిడిపి నేతలు ఉంటారన్న ఆలోచన కూడా చేయలేదు. కనీసం ఎవరితో ఆలోచించలేదు కూడా. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలుగా ధూళిపాళ్ల నరేంద్ర, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పరిటాల సునీత, పత్తిపాటి పుల్లారావు, యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు తదితరులు మంత్రి పదవులు ఆశించారు. ఇలాంటి వారంతా టిడిపి నే నమ్ముకున్నారు. కానీ వీరికి మాత్రం మంత్రి పదవులు దక్కలేదు. ఎన్నికలకు ముందు టిడిపిలో చేరిన ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథి లాంటి వారికి మాత్రం ఇట్టే పదవులు దక్కడం విశేషం.

అయితే ఈసారి మంత్రి పదవుల పంపకాల్లో లోకేష్ మార్కు కనిపిస్తోంది. సీనియర్లను కాదని జూనియర్లను లోకేష్ కోసం మాత్రమే భర్తీ చేశారని ప్రచారం ఉంది. అయితే కుమారుడి కోసం సీనియర్లను బలిపశువుగా పెట్టారు. కానీ ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో మాత్రం పూర్తి సీనియారిటీ, సిన్సియారిటీకి పెద్దపీట వేస్తామని చంద్రబాబు చెప్తున్నారు. అయితే కుమారుడి కోసం అలా మంత్రి పదవులు పక్క పార్టీల వారితో భర్తీ చేసి.. ఇప్పుడు నామినేటెడ్ పదవుల విషయంలో మాత్రం నీతి నిజాయితీ అంటూ మాటలు చెబుతున్నారు అని చంద్రబాబుపై సొంత పార్టీ శ్రేణులే విమర్శలకు దిగుతున్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!