వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. వచ్చే ఎన్నికలను ఆయన చాలా ప్రతీష్టాత్మకంగా తీసుకున్నారు. 2024లో జరిగే ఎన్నికల్లో ఓటమికి ఎక్కడ కూడా తావు లేకుండా చూసుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారిగా సమావేశాలను నిర్వహిస్తు.. పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తున్నారాయన. దీనిలో భాగంగానే 2024లో పోటీ చేసి అభ్యర్థులను ప్రకటించుకుంటుపోతున్నారు. దీనికి కుప్పం నుంచే నాంది పలికారాయాన. కుప్పంలో చంద్రబాబును ఓడించాలని జగన్ ఎప్పటి నుంచే ప్రణళికలు రచిస్తున్నారు. దీనికి అనుగుణంగానే భరత్‌ను రంగంలోకి దించుతున్నారు. తరువాత టెక్కలి నియోజకవర్గం నుంచి దువ్వాడ శ్రీనివాస్, అద్దంకి నియోజకవర్గం నుంచి బాచిన కృష్ణ చైతన్యకు టిక్కెట్లు ఇస్తున్నట్లుగా జగన్ ప్రకటించారు. తాజాగా మరో ప్రతిష్టత్మకమైన నియోజకవర్గంపై సమీక్ష నిర్వహించారాయన.
విశాఖ నగరం నార్త్ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ నేతలతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితుల పైన ఆరా తీసారు. అక్కడ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు కొనసాగుతున్నారు. పార్టీ ఏదైనా .. ఎన్నిక ఎప్పుడు జరిగిన కూడా గెలుపు గంటా తలుపు తడుతునే ఉంది. ఆయన టీడీపీ ,కాంగ్రెస్, ప్రజరాజ్య ఇలా ఏ పార్టీ నుంచి పోటీ చేసిన కూడా విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో అనేది క్లారిటీ లేదు. గంటా శ్రీనివాసరావు టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కూడా సమావేశం అయ్యారు. దీనిని బట్టి ఆయన ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారో ఎవరికి అర్థం కావడం లేదు. అయితే గంటా శ్రీనివాసరావు ఏ పార్టీ నుంచి పోటీ చేసిన కూడా ఓడించడాలని జగన్ ఫిక్స్ అయినట్లుగా కనిపిస్తుంది.
దీనిలో భాగంగానే నియోజకవర్గ వైసీపీ నేతలతో , కార్యకర్తలతో సమావేశం నిర్వహించారాయన. నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితుల పైన ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. నియోజకవర్గంలోని నేతల మధ్య విభేదాలు ఏమున్నా అన్నీ కూడా పక్కన పెట్టి పార్టీ కోసం పని చేయాలని సీఎం జగన్ తేల్చి చెప్పారు. నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న కేకే రాజునే వచ్చే ఎన్నికల్ల వైసీపీ అభ్యర్ధిగా ముఖ్యమంత్రి ఖరారు చేశారు. నియోజకవర్గంలో చాలా అభివృద్ది చేశామని జగన్ గుర్తు చేశారు. నియోజకవర్గంలో 1.05 లక్షల ఇళ్లుంటే..దాదాపు 80 వేల ఇళ్లకు ఈ మూడేళ్లలో అనేక పథకాలు అందాయని ఇవ్వన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని నాయకులకు దిశ నిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరాలని జగన్ నాయకులకు తేల్చి చెప్పారు. మరి గంటా వ్యూహాలను కేకే రాజు ఎలా తట్టుకుని విజయం సాధిస్తారో చూడాలి.