Friday, March 29, 2024

ఎన్టీఆర్‌ను ఓడించి కాంగ్రెస్ తరుఫున కృష్ణ సీఎం కావాలని చూశారా ..? సంచలన విషయాలు వెలుగులోకి

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌కు సీఎం అయ్యే అవకాశాన్ని కృష్ణ చేజార్చుకున్నారా..? ఎన్టీఆర్‌ను ఓడించి కృష్ణ సీఎం కావాలని చూశారా ..?

సూపర్ స్టార్ కృష్ణ మరణంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం శోకసంధ్రంలో మునిగిపోయింది. కృష్ణ మరణంపై సినీ ప్రముఖులతో పాటు, రాజకీయ ప్రముఖులు కూడా తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, ప్రభాస్, రాం చరణ్, ఎన్టీఆర్ వంటి సినీ నటులుతో పాటు, టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేఎపాల్ వంటి రాజకీయ ప్రముఖులు కూడా సూపర్ స్టార్ కృష్ణకు నివాళులు అర్పించారు. ఇక కృష్ణ సినీ జీవితం గురించి అందరికి తెలిసిందే. 350 సినిమాలలో హీరోగా నటించిన ఏకైక నటుడు కృష్ణనే కావడం విశేషం. ఇక ఆయన నిర్మాతల హీరో అనే విషయం అందరికి తెలిసిందే. సినిమా ప్లాప్ అయితే..తన రెమ్యూనిరేషన్ కూడా తీసుకునే వారు కాదు. అలాంటి మహోన్నత వ్యక్తి మరణిస్తే.. యావత్తు సినిమా లోకం మొత్తం కూడా విషాదంలో మునిగిపోయింది.

అటు సినిమా ఇండస్ట్రీలో అయిన .. ఇటు రాజకీయాల్లో అయిన ఎన్టీఆర్‌ను ఎదురించిన ఏకైక వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణనే. ఎన్టీఆర్ సీఎం అయ్యేసరికి, ఆయన వ్యతిరేకులంతా దెబ్బకు సైలెంట్ అయ్యారు. కానీ కృష్ణ న మాత్రమే ఆయన్ను ఎదురించి ముందుకు వెళ్లారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలోనే ఆయన మీద సెటైరికల్‌గా మండలాధీశుడు వంటి సినిమా తీశారు. తన సినిమాల ద్వారా ఎన్టీఆర్ నిజస్వరూపాన్ని నిర్మొగమాటంగా, నిర్భయంగా ప్రపంచానికి చాటిచెప్పింది ఘనత ఖచ్చితంగా కృష్ణకే దక్కుతుంది. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ కృష్ణ రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేశారు. ఆయన తొలినుంచి కూడా కాంగ్రెస్ భావజాలంతోనే ముందుకు సాగారు. సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరుతుంటే… కృష్ణ మాత్రం అందరికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్టీఆర్‌ను ఢీ కట్టే సత్తా… కృష్ణకు మాత్రమే ఉందని గ్రహించి.. ఆయనకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కృష్ణ ఏలూరు నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఆ సమయంలోనే ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఉన్నత పదవులు ఇవ్వడం కూడా మొదులపెట్టింది. కాని తరువాత ఎన్నికలలో ఆయన గుంటూరు నుంచి పోటీ చేస్తానని ప్రతిపాదినించప్పటికి కూడా కాంగ్రెస్ పెద్దలు తిరిగి ఏలూరు నుంచే పోటీ చేయాలని కోరడంతో.. అక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే రాజీవ్ గాంధీతో కృష్ణకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. రాజీవ్ గాంధీతో కూడా కృష్ణ తీసుకున్న నిర్ణయాలకు పెద్ద పీఠ వేసేవారు. ఆ సమయంలో వీరిద్దరు మధ్య ఎన్టీఆర్‌ను ఎలా ఓడించాలనే ముఖ్యంగా చర్చించుకునేవారని తెలుస్తోంది. ఎన్టీఆర్‌ను ఓడిస్తే.. కనుక ఆంధ్రప్రదేశ్‌కు మిమ్మల్నే సీఎంను చేస్తామని కృష్ణకు రాజీవ్ గాంధీ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిపై కృష్ణ అలాంటిది ఏమి వద్దని.. అందరం కలిసి పని చేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరుకుంటున్నానని రాజీవ్ గాంధీతో కృష్ణ చెప్పారట. కాని .. రాజీవ్ గాంధీ హత్యతో కృష్ణ షాక్‌కు గురైయ్యారు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో .. కృష్ణ క్రియశీల రాజకీయల నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించారు. అదే కనుక రాజీవ్ గాంధీ బ్రతికి ఉంటే.. కృష్ణ ఖచ్చితంగా సీఎం అయ్యేవారని ఇప్పటి కాంగ్రెస్ పెద్దలు చర్చించుకుంటున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణ సీఎం అయ్యే అవకాశాన్ని చేజార్చుకున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!