జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు బాగున్నాయి – జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ అధికారి జేడీ లక్ష్మీనారాయణ మరొసారి జగన్ సర్కార్ మీద ప్రశంసలు కురిపించారు.గతంలో పలు సందర్భాల్లో జగన్ ప్రభుత్వం మీద ప్రశంసలు కురిపించిన ఆయన .. తాజాగా మరొసారి జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలను గురించి మాట్లాడి సంచలనం సృష్టించారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జగన్‌కు జైలుకు పంపించడంలో మాజీ జేడీ లక్ష్మీనారాయణ కుట్రలు పన్నారని అప్పట్లో గట్టిగానే ఆరోపణలు వినిపించాయి. అయితే లక్ష్మీనారాయణ సీబీఐలో తన పదవికి రాజీనామా చేసి , రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదట ఆయన టీడీపీ పార్టీలో చేరుతున్నారని వార్తలు వినిపించిన్నప్పటికి తరువాత ఆయన పవన్ కల్యాణ్ జనసేన పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున పోటీ చేసి ఓడిన ఆయన , తరువాత పార్టీకి రాజీనామా చేశారు. పవన్ కల్యాణ్ సిద్దాంతాలు నచ్చకే తాను పార్టీని వీడానని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణమాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తునే ఉన్నారు.
ఆ మధ్య జగన్ పాలనపై కూడా కామెంట్స్ చేశారు.గతంలో ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ పరిపాలనపై కామెంట్స్ చేశారు. ఎన్నికల సమయంలో ఏదైతే చెప్పారో , తన పాలనలో అదే చేసి చూపిస్తున్నారని ప్రశంశించారు. మొదట్లో జగన్ ఎలా పరిపాలిస్తాడో అనే అనుమానం ఉండేది. కాని రాజ్యంగంపై ఆయనకు మంచి పట్టు ఉందని ఆ పరిపాలన ద్వారా అర్థం అయిందని చెప్పుకొచ్చారు.రాష్ట్రంలో ప్రతి జిల్లా కూడా అభివృద్ది చెందాలని తాను కోరుకుంటున్నామని.. అధికార వికేంద్రికరణ జరిగితేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని జేడీ చెప్పుకొచ్చారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని లక్ష్మీనారాయణ తెలిపారు. తాజాగా ఆయన ఏపీలో అమలు అవుతున్న పథకాలు గురించి మాట్లాడారు. జేడీ లక్ష్మీనారాయణ జగన్ ప్రభుత్వ సంక్షేమ పధకాలను బాగానే ఉన్నాయని అంటున్నారు.
అమెరికా లాంటి దేశం కూడా కోవిడ్ సమయంలో ఒక్కో కుటుంబానికి భారీ ఆర్ధిక సాయం చేసిందని గుర్తు చేశారు. సంక్షేమ పధకాలు పేదరికం నుంచి బయటకు తేవడానికే అని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయల్సిందే అని జేడీ చెప్పుకొచ్చారు. జగన్ ప్రభుత్వం పని తీరు మీద తాను అభిప్రాయం చెప్పడం కంటే 2024 ఎన్నికల్లో ప్రజలు చెబుతారు అని జేడీ వివరించారు. ఇప్పటికే ఏపీలో అమలు అవుతున్న పథకాల విషయంలో ప్రతిపక్షాలు కూడా యూటర్న్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అయితే ఇంతకు మించిన సంక్షేమ పధకాలు అందిస్తామని చెబుతున్నారు. పవన్ సైతం ఇటీవల సంక్షేమ పథకాలను జనసేన అధికారంలోకి వస్తే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తాజాగా జేడీ కూడా సంక్షేమ పథకాలు గురించి కామెంట్స్ చేయడంతో.. వైసీపీకి కొంత అండ దొరికినట్లు అయింది.