Monday, February 10, 2025

త్వరలో జగన్మోహన్ రెడ్డి, అల్లు అర్జున్ కలయిక.. పొలిటికల్ షేక్ తప్పదా?

- Advertisement -

వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డిని అల్లు అర్జున్ కలవబోతున్నారా? త్వరలో ఈ ఇద్దరు కలుసుకోబోతున్నారా? తన పుష్పా 2 చిత్రానికి అన్ని విధాలుగా అండగా నిలిచిన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలపబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 చిత్రం విజయవంతంగా ప్రదర్శితం అయింది. సినిమా సూపర్ హిట్ సాధించింది. అయితే ఈ సినిమా చుట్టూ వివాదాలు కూడా అదే స్థాయిలో నడిచాయి. మెగా ఫ్యామిలీ తో సంబంధం లేని విధంగా అల్లు అర్జున్ ప్రకటనలు ఇచ్చారు. దీంతో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పకపోతే పుష్ప 2 సినిమాను అడ్డుకుంటామని జనసేన నేతలు హెచ్చరించారు. ఆ సినిమాను ప్లాప్ చేస్తామంటూ మెగా అభిమానులు సైతం హెచ్చరించారు. కానీ ఆ సమయంలో అండగా నిలిచారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.

రాష్ట్రవ్యాప్తంగా పుష్ప 2 చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద వైసీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. జనసేన నేతలు ఎలా అడ్డుకుంటారో చూస్తామని హెచ్చరించాయి. జగన్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను సైతం ఏర్పాటు చేశారు అభిమానులు. మా కోసం నువ్వు వచ్చావు.. మీకోసం మేము వస్తామంటూ జగన్ అభిమానులు అల్లు అర్జున్ కు అండగా నిలిచారు. థియేటర్ల వద్ద అల్లు అర్జున్ తో పాటు జగన్మోహన్ రెడ్డి భారీ ఫ్లెక్సీలను, కటౌట్ లను ప్రదర్శించారు. సినిమా ప్రదర్శిస్తున్న సమయంలో కూడా వైసిపి జండాలతో జగన్ అభిమానులు హల్చల్ చేశారు. మొదటి నుంచి కూడా పుష్ప 2కు మద్దతుగా నిలిచి ఆ సినిమా హిట్ కావడంలో జగన్ అభిమానులు కీలక పాత్ర పోషించారు. వైసిపి మద్దతుదారులు అండగా నిలవడంతోనే సినిమా అంతటి ఘన విజయం సాధించిందని సినీ పండితులు సైతం అభిప్రాయపడ్డారు.

పుష్ప 2 చిత్ర ప్రదర్శన సమయంలో హైదరాబాదులోని ఓ థియేటర్ వద్ద అపశృతి జరిగిన సంగతి తెలిసిందే. ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్దకు వచ్చారు. ఆ సమయంలో భారీ తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి చెందింది. దానికి బాధ్యుడిని చేస్తూ అల్లు అర్జున్ ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకరోజు ఆయన పోలీస్ స్టేషన్లో ఉండిపోవాల్సి వచ్చింది. అల్లు అర్జున్ అరెస్టుపై సినీ సెలబ్రిటీలతోపాటు రాజకీయ నాయకులు స్పందించారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం స్పందించారు. అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు. నేరుగా అల్లు అరవింద్ కు ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు. అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

మరోవైపు అల్లు అర్జున్ కు అండగా వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు. జగన్ సూచన మేరకు ఆయన అల్లు అర్జున్ తరఫున వాదనలు వినిపించారు. బెయిల్ తెప్పించడంలో కీలక పాత్ర పోషించారు. బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ జగన్మోహన్ రెడ్డికి నేరుగా ఫోన్ చేసినట్లు అప్పట్లో ప్రచారం నడిచింది. తన సినిమాతో పాటు తాను కష్టకాలంలో ఉండగా అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపినట్లు టాక్ నడిచింది. అయితే ఇప్పుడు అదే అల్లు అర్జున్ నేరుగా జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఒకవేళ అల్లు అర్జున్ జగన్మోహన్ రెడ్డిని కలిస్తే మాత్రం ఒక్కసారిగా రాజకీయాల్లో కుదిపే. ఎందుకంటే ఈ ఎన్నికల్లో పరోక్షంగా వైసీపీకి మద్దతు తెలిపారు అల్లు అర్జున్. నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడం ద్వారా తన అభిమానులకు స్పష్టమైన సంకేతాలు పంపగలిగారు. అయితే ఎన్నికల అనంతరం కూడా అల్లు అర్జున్ అభిమానులు వైసీపీకి మద్దతుదారులుగా మారిపోయారు. ఇప్పుడు గాని అల్లు అర్జున్ జగన్మోహన్ రెడ్డిని కలిస్తే పూర్తిగా డిక్లేర్ అవుతారు. ప్రధానంగా మెగా అభిమానుల్లో భారీ చీలిక వస్తుంది. కాపుల్లో ఒక రకమైన కదలిక ప్రారంభమవుతుంది. జనసైనికులు సైతం విపరీతంగా స్పందిస్తారు. సో ఈ కలయిక ఏపీ రాజకీయాలను షేక్ చేయనుందన్నమాట.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!