అన్ స్టాపబుల్ షో ఏపీ రాజకీయాలకు వేదికగా మారుతుందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. టాలీవుడ్ టాప్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ షోకు హోస్ట్‌గా వ్యవరిస్తున్నారు. మొదటి సీజన్ సూపర్ డూపర్ హిట్ కావడంతో.. ఇటీవలే రెండో సీజన్‌ను మొదలు పెట్టడం జరిగింది. అన్ స్టాపబుల్ షో మొదటి సీజన్ కేవలం సినిమా రంగానికి చెందినవారినే పిలవడం జరిగింది. కాని రెండో సీజన్ మాత్రం.. దానికి విరుద్దంగా సాగుతుందనే చెప్పాలి. రెండో సీజన్ మొదటి ఎపిసోడ్‌కే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌ను పిలిచారు. చంద్రబాబు, నారా లోకేష్‌లను కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలను అడిగిన బాలకృష్ణ …ఎటువంటి సమయంలో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవాల్సి వచ్చిందో తెలియజేసే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో వైఎస్ఆర్ తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి.. వైసీపీ కార్యకర్తల మనస్సులను కూడా గెలిచే ప్రయత్నం చేశారాయన.
చంద్రబాబు, నారా లోకేష్‌ల తరువాత మరో పోలిటికల్ లీడర్‌ను పిలవడానికి షో యాజమాన్యం రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఆ పోలిటికల్ లీడర్ మరెవరో కాదు.. ఉమ్మడి ఆఖరి సీఎం అయిన కిరణ్ కుమార్ రెడ్డి. అవును మీరు వింటుంది నిజమే.. అన్ స్టాపబుల్ షోకు కిరణ్ కుమార్ రెడ్డిని ఆహ్వానించినట్లుగా సమాచారం అందుతుంది. కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ స్పీకర్ కే ఆర్ సురేష్ రెడ్డి కూడా ఇదే ఎపిసోడ్‌లో కనిపించబోతోన్నారట. రాష్ట్ర విడిపోయిన తరువాత సురేష్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. ప్రస్తుతం ఆయనరాజ్యసభ సభ్యుడుగా కొనసాగుతున్నారు. వీరిద్దరు కలిసి అన్ స్టాపబుల్ షోకు రాబోతున్నారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ ఈరోజే ప్రారంభం కానుంది. ఓ సినిమా టాక్ షోకు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి అతిథులుగా రాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
వీరిద్దరిని తనదైనశైలిలో ప్రశ్నించడానికి బాలకృష్ణ రెడీ అవుతున్నారు. వీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో పలు సంగతులను ఆయన అడిగి తెలుసుకోనున్నారని తెలుస్తోంది. దీంతో పాటు అసలు రాష్ట్రం వీడిపోవడానికి కారణం జగనే అని చెప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఏపీ రాష్ట్రం దివాళ తీస్తోందని.. వీరితో చెప్పించడమే ప్రధాన ఏజెండా కనిపిస్తుంది. టార్గెట్ జగన్ అనే నినాదంతో ఈ రాజకీయ నాయకులను అన్ స్టాపబుల్ షోకు ఆహ్వానిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇక రాబోవు కాలంలో కూడా అన్‌స్టాపబుల్ షోకు రాజకీయ నాయకులను కూడా పిలవడానికి సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఆహా ఓటీటీ మెగా ప్రొడ్యుసర్ అల్లు అరవింద్‌ది. ఆయన ఎలాగు పవన్ కల్యాణ్ కోసం పని చేస్తారని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. పవన్ ఎటు టీడీపీ గెలుపు కోసం పని చేస్తారు .. ఇలా అన్ని విధాల అన్‌స్టాపబుల్ షోను తమకు ఉపయోగకరంగా వాడుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తుంది.