Monday, February 10, 2025

జగన్ కు అస్త్రాలు అందిస్తున్న ప్రధాని మోదీ.. ఇరకాటంలో చంద్రబాబు!

- Advertisement -

ఏపీలో జగన్మోహన్ రెడ్డికి అస్త్రం దొరికిందా? కూటమి ప్రభుత్వంపై ఆయన విమర్శల దాడి చేయనున్నారా? అందుకు కేంద్ర పెద్దలు అవకాశం ఇచ్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి తగిన ప్రాధాన్యం దక్కలేదు. కనీస స్థాయిలో కూడా కేటాయింపులు లేవు. కేంద్రంలో కీలక భాగస్వామిగా ఉంటూ చంద్రబాబు ఏపీకి ఏమి ప్రత్యేకంగా సాధించలేకపోయారు. అటు కేంద్ర మంత్రి బడ్జెట్ ప్రసంగంలో సైతం ఏపీ ప్రస్తావన లేదు. దీనిపై ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది. దానిపైనే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలో జిల్లాల పర్యటనకు జగన్ సిద్ధపడుతున్న సంగతి తెలిసిందే. అటు కేంద్రం నుంచి నిధులను తెప్పించుకోవడంలో చంద్రబాబు ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తోంది. దానిని ఇప్పుడు హైలెట్ చేయనున్నారు జగన్మోహన్ రెడ్డి. తద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు నిర్ణయించారు.

ప్రధాని మోదీ ఒక వ్యూహం ప్రకారం ఏపీ విషయంలో ముందుకు వెళుతున్నట్లు స్పష్టం అవుతుంది. కేవలం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలకు, పరిశ్రమలకు మాత్రమే నిధులు కేటాయిస్తున్నారు. అయితే అవన్నీ మా చొరవ తో ఏర్పాటు చేసినవని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఆశించిన స్థాయిలో నిధులు రావడం లేదు. గత బడ్జెట్లో అమరావతి రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. అయితే అది ప్రపంచ బ్యాంకు తో పాటు ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి నిధులు సర్దుబాటు చేశారు. అది కేవలం రుణం మాత్రమే. అటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సాధారణ నిధులే కేటాయిస్తున్నారు. కానీ ఏపీకి అంటూ ప్రత్యేక ప్రయోజనాలేవి దక్కడం లేదు. అయితే ప్రధాని మోదీ ఏపీలో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కు మాత్రమే నిధులు కేటాయిస్తుండడం గుర్తించదగ్గ విషయం. తద్వారా ఏపీ సీఎం చంద్రబాబు నోరు మూయించే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు నోరు తెరవలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు.

మరోవైపు ఏపీలో సంక్షేమ పథకాలు ఊసులేదు. సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేశారు. సంపద సృష్టి అన్న మాటను మరిచిపోయారు. ఇప్పుడు కొత్తగా పన్నులతో పాటు చార్జీలను పెంచుతున్నారు. బాదుడు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు దక్కకపోవడంతో ఇలా చార్జీలను పెంచి ఆదాయం పెంచుకునే పనిలో పడింది చంద్రబాబు సర్కార్. అందుకే జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ప్రజల్లో పెట్టేందుకు స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. నిధుల సహాయ నిరాకరణ ద్వారా ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబును ఇరకాటంలో పెట్టారు. విపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి సమ్మోహన అస్త్రాన్ని అందించారు.

ఈ అభివృద్ధి నినాదంతో జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో పలుచన చేశారో.. అదే ట్యాగ్ తో చంద్రబాబును ఇరకాకంలో పెట్టాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధాని. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడడం ఆయన బాధ్యత. కానీ ఏపీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఉందని చంద్రబాబు తరచూ చెబుతున్నారు. కేంద్రం ఏపీ పట్ల ప్రత్యేక భావనతో ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. గత ఎనిమిది నెలలుగా ఇదే మాటలతో నెట్టుకొచ్చారు. కానీ ప్రధాని మోదీ మాత్రం తనకు అన్ని రాష్ట్రాలు సమానమన్న రీతిలో ఉన్నారు. తద్వారా తాను ఏపీ పట్ల ప్రత్యేకంగా చూడడం లేదని సంకేతాలు ఇచ్చారు. వార్షిక బడ్జెట్లో కూడా కేటాయింపులు అంతంతమాత్రంగానే చేశారు. పరోక్షంగా ఇది జగన్మోహన్ రెడ్డికి అస్త్రం అందించినట్టే. కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తారు. కూటమి ప్రభుత్వంపై గళం ఎత్తుతారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!