Monday, February 10, 2025

టిడిపి కంటిమీద కునుకు లేకుండా చేసిన విజయసాయిరెడ్డి!

- Advertisement -

విజయసాయిరెడ్డి రాజీనామా ఎపిసోడ్ టిడిపిని కలవరపెడుతోంది. అసలు ఆయన రాజీనామా వెనుక ఉన్న కారణం ఏంటి అనేది అంతుపట్టడం లేదు. పైగా రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి తాను వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తు మాట అనలేదు. వైసీపీ నేతలపై ఎటువంటి ఆరోపణలు చేయలేదు. పైగా వైసీపీలో తన ప్రాధాన్యత తగ్గడం వల్లే బయటకు వచ్చానని చెప్పలేదు. తనకు వైసీపీలో మంచి స్థానమే దక్కిందని చెప్పడం ఎల్లో మీడియాకు మింగుడు పడడం లేదు. అప్పటినుంచి విజయసాయి రెడ్డి పై ఎదురుదాడి కొనసాగుతూనే ఉంది. చివరకు బిజెపితో కూడా లింకు కట్టి అనుమానాలు వ్యక్తం చేసేదాకా పరిస్థితి వచ్చింది. అంటే విజయసాయిరెడ్డి రాజీనామాకు వైసీపీ కంటే టిడిపి ఎక్కువగా భయపడుతోంది.

విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన వెంటనే ఎల్లో మీడియా కథనాలు వండి వార్చింది. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా రెచ్చిపోయింది. సోషల్ మీడియా సైతం అదే పనిగా ప్రచారం మొదలుపెట్టింది. కాకినాడ పోర్టు విషయంలో అరబిందో పై కేసుల భయంతోనే విజయసాయిరెడ్డి ఈ నిర్ణయానికి వచ్చారని ప్రచారం చేసింది. తన కుటుంబంతో పాటు అల్లుడి కుటుంబం పై, కుటుంబ ఆస్తులపై కేసుల నమోదు తోనే విజయసాయిరెడ్డి దారికి వచ్చారని చెప్పుకొచ్చింది. ఇంకోవైపు జగన్ అక్రమస్తుల కేసుల్లో అప్రూవర్గా మారేందుకే జగన్ బయటకు వచ్చారని.. బిజెపి జగన్ ను టార్గెట్ చేసుకోవడం వల్లే.. విజయసాయిరెడ్డిని అడ్డంగా బుక్ చేశారని.. రాజీనామా చేయించారని కూడా కథనాలు రాసింది.

అక్కడితో ఆగకుండా విజయసాయిరెడ్డి ని పొమ్మనలేక పొగ పెట్టడం వెనుక భారతి రెడ్డి హస్తం ఉందని కూడా ఆరోపణలు చేసింది ఎల్లో మీడియా. వైసీపీలో విజయసాయిరెడ్డి ప్రాధాన్యం పెరగడంతో.. ఏనాటికైనా అపాయం అని తెలిసి భారతి రెడ్డి ఒక ప్లాన్ ప్రకారం బయటకు పంపించారని ఆరోపణలు చేస్తూ ప్రచారం ప్రారంభించారు. అందుకే విజయసాయిరెడ్డి తన రాజీనామా చేసిన తరువాత భారతి రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారని.. తనను అన్ని విధాల ప్రోత్సహించారని ఎద్దేవా చేస్తూ ఆ కామెంట్స్ చేశారన్నది టిడిపి నుంచి వచ్చిన అనుమానం.

అయితే ఏబీఎన్ రాధాకృష్ణ మరో కథనం రాశారు. బిజెపి డోర్లు క్లోజ్ చేయడం వల్లే విజయసాయిరెడ్డి పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకున్నారని చెప్పుకొచ్చారు. విజయసాయిరెడ్డి చేరుతామంటే చంద్రబాబు బిజెపి వద్ద అభ్యంతరాలు చెప్పారని.. అందుకే ఆయన చేరిక నిలిచిపోయిందని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే చంద్రబాబు అభ్యంతరాలు వ్యక్తం చేసిన చాలామంది నేతలు బిజెపిలో చేరిపోయారు. వారి విషయంలో చంద్రబాబు అభ్యంతరాలు పనిచేయలేదు. ఇప్పుడు విజయసాయిరెడ్డి విషయంలో మాత్రం చంద్రబాబు అభ్యంతరాలు పనిచేశాయి. అదే విషయాన్ని మార్చి మార్చి చెప్పుకొచ్చారు రాధాకృష్ణ. అయితే విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటన వచ్చిన మరుక్షణం నుంచి టిడిపి మల్ల గుల్లాలు పడుతూనే ఉంది. తొలుత ఆనందించిన ఆ పార్టీ క్రమేపి బాధతో పాటు ఇబ్బందులతో కనిపిస్తోంది. ఒక రకమైన కన్ఫ్యూజన్ ఆ పార్టీలో క్రియేట్ అయ్యింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!