Sunday, March 16, 2025

స్టాండ్ మార్చుకున్న వైసిపి.. రాజధానిపై యూటర్న్!

- Advertisement -

ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే ఫైనల్. దానికి ఏ రాజకీయ పార్టీ అయినా తలవంచాల్సిందే. ఇందుకు జగన్మోహన్ రెడ్డి అతీతుడు కాదు. చంద్రబాబు సైతం అతీతుడు కాదు. 2019లో ఘోర పరాజయం చవిచూశారు చంద్రబాబు. తన పాలనలో వైఫల్యాలపై పోస్టుమార్టం చేశారు. ఒక పద్ధతి ప్రకారం ప్రజల్లోకి వచ్చారు. విపక్షాలను కలుపుకెళ్లారు. కూటమి కట్టి విజయం సొంతం చేసుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సైతం అదే ఫార్ములాను అనుసరించక తప్పదు.

వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాను అంటే కుదిరే పని కాదు. సింహం సింగిల్ గా వస్తుంది.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోరాటం చేస్తుంది.. తమకు ఎవరు అవసరం లేదు. అనే మాటలను మాత్రం మరిచిపోవాల్సిన అనివార్య పరిస్థితి. 2012- 2024 ఒక ఎత్తు. 2024 నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది మరో ఎత్తు. ఓటముల నుంచి గుణపాఠం నేర్చుకోకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికర పరిస్థితులు తప్పవు.

గతం మాదిరిగా ఇతర పార్టీలతో సర్దుబాటు కుదరదని చెబితే వీలు పడేది కాదు. ఆ మూడు పార్టీల కూటమి కొనసాగుతుంది. చంద్రబాబుతో స్నేహాన్ని విడిచి పెట్టుకునేందుకు పవన్ కళ్యాణ్ ముందుకు రారు. మరో 30 సంవత్సరాలు తమ మైత్రి కొనసాగుతుందని తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్. అటు బిజెపి వైఖరి కూడా అదే మాదిరిగా ఉంది. సో వచ్చే ఎన్నికల్లో కూడా మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయి. మూడు పార్టీల ఓటింగ్ చెదిరిపోదు. ఇప్పుడున్న 45 శాతానికి ఓటింగ్ పడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి పై ఉంది. దానిని పెంచుకునే క్రమంలో ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయాలి. తటస్థ ఓటు బ్యాంకును టార్గెట్ చేయాలి. మిగతా రాజకీయ పక్షాలతో పొత్తు పెట్టుకోవాలి.

అమరావతి రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ స్టాండ్ మార్చుకునేలా కనిపిస్తుండడం శుభపరిణామం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమికి రాజధానుల అంశం ప్రధాన కారణం. మూడు రాజధానులు తెరపైకి తీసుకురావడం.. వాటిని పూర్తి చేయలేకపోవడం ముమ్మాటికి మైనస్. పాలనా వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకొచ్చింది. కానీ ప్రజలు దానిని నమ్మలేదు. అందుకే ఆ నిర్ణయాన్ని పునసమీక్షించుకోవాల్సిన అవసరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఉంది. కచ్చితంగా దీనిపై ఉన్న సమీక్షిస్తామని స్వయంగా మండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రకటించడం శుభ పరిణామం.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!