Sunday, March 16, 2025

ఎన్నికల్లో కూటమికి మద్దతు.. ఇప్పుడేమో వైసీపీకి గుడ్ బై.. ఇదేంటి దొరబాబు?

- Advertisement -

ఏపీలో రాజకీయాలు విచిత్రంగా ఉన్నాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో చెప్పలేని పరిస్థితి. అధికారానికి వెతుక్కుంటూ ఒకరు.. ప్రలోభాలకు లొంగి ఇంకొకరు.. కేసులకు భయపడి మరొకరు.. ఇలా వరుసగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. అయితే ఎన్నికలకు ముందు నుంచే కూటమి పార్టీలకు సహకరించిన వారు ఉన్నారు. అటువంటి వారు ఇప్పుడు లేటెస్ట్ గా కూటమి పార్టీల్లో చేరుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వారు వీడుతున్నట్లు ఎల్లో మీడియా పతాకస్థాయిలో ప్రచారం చేస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ అన్నట్టు సోషల్ మీడియాలో సైతం ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్నికలకు ముందే చాలామంది నేతలు కూటమి పార్టీలకు అనుకూలంగా పనిచేశారు. పేరుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కానీ.. పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేసిన వారే అధికం.

తాజాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండ్యం దొరబాబు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. పార్టీలో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. త్వరలో తాను జనసేనలో చేరతానని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఆయన ఎప్పుడో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచారని.. ఇప్పుడు కొత్తగా చేరడం ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ బరిలో దిగారు. దీంతో జగన్మోహన్ రెడ్డి అప్రమత్తం అయ్యారు. కాపు సామాజిక వర్గం తో పాటు మహిళ ముద్రవేయాలన్న కోణంలో వంగ గీతను అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న దొరబాబు ఈ నిర్ణయంతో మనస్థాపానికి గురయ్యారు. అదే సమయంలో పిఠాపురంలో ముద్రగడ పద్మనాభం సైతం చాలా యాక్టివ్ అయ్యారు. తనకు ప్రాధాన్యత తగ్గిందని భావించిన పెండ్యం దొరబాబు పక్కకు తప్పుకున్నారు. మౌనం దాల్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగ గీతకు మద్దతుగా నిలవలేదు. ఈ ఎన్నికల్లో దాదాపు దొరబాబు అనుచరులు జనసేన కోసం పనిచేశారు. పవన్ కళ్యాణ్ గెలుపులో భాగస్వామ్యం అయ్యారు.

అయితే ఇప్పుడు పెండ్యం దొరబాబు తాను జనసేనలో చేరుతానని చెబుతుండడం మాత్రం వింతగా ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ అంటూ ఎల్లో మీడియా పతాక శీర్షికన కథనాలు రాస్తోంది. కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయడానికి పెండ్యం దొరబాబు లాంటి నేతలను వాడుకుంటున్నట్లు అనుమానాలు ఉన్నాయి. దాదాపు ఎన్నికల ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండి వివిధ కారణాలతో కూటమి పార్టీలకు సపోర్ట్ చేసిన చాలా మంది నేతలు ఇప్పుడు జనసేన లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అటువంటి వారిని జనసేన ఆవిర్భావ సభలో చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. దానినే ప్రచార అస్త్రంగా మార్చుకుంటున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!