Wednesday, March 19, 2025

వైసిపి పై కుట్ర.. చేతులు కలిపిన బిజెపి.. ప్లాన్ అదే!

- Advertisement -

వైసిపి పై కుట్ర జరుగుతోందా? టిడిపి తో పాటు బిజెపి సంయుక్త ఆపరేషన్ ప్రారంభం అయిందా? ఓ ఇద్దరూ రాజ్యసభ సభ్యులు వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారా? కూటమి పార్టీల్లో చేరుతారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే హాట్ టాపిక్. ఏపీ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆ పార్టీలోని కీలక నేతలను కూటమిలోకి తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ జరుగుతున్నట్లు సమాచారం.

ఈనెల 5, 6 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈనెల ఐదున ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీ తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. అదేరోజు సాయంత్రం తిరిగి విశాఖపట్నం రానున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం చంద్రబాబు ఢిల్లీ వెళ్తారని తెలుస్తోంది. ఆరో తేదీన రోజంతా అక్కడే గడుపుతారని సమాచారం.

ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ ఇద్దరు రాజ్యసభ సభ్యులు బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఒకరు బిజెపిలోకి, మరొకరు టిడిపిలోకి చేరేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. అయితే ఆ ఇద్దరిని బిజెపిలోకి చేర్చుకుంటామని అగ్రనేతలు చెప్పుకుంటున్నారట. అయితే ఇప్పటికే విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభ పదవి ఖాళీ అయింది. దానిని బిజెపికి విడిచి పెట్టేందుకు చంద్రబాబు సమ్మతించినట్లు సమాచారం.

ఇంకోవైపు ఈ నెల 20న ఎమ్మెల్యేల కోటా కింద ఓ ఐదు ఎమ్మెల్సీల భర్తీకి పోలింగ్ జరగనుంది. అయితే అందులో ఒక ఎమ్మెల్సీ పదవి మెగా బ్రదర్ నాగబాబుకు ఖరారు అయింది. మిగతా నాలుగు పదవుల్లో.. ఒక ఎమ్మెల్సీ సీటును కోరుతోంది బిజెపి. అయితే ఎమ్మెల్సీ ఇవ్వలేమని.. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ పదవిని ఇస్తామని.. తరువాత భర్తీ చేసే ఎమ్మెల్సీ పోస్టుల్లో కేటాయిస్తామని చంద్రబాబు వారికి నచ్చ చెప్పనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేందుకే చంద్రబాబు ఢిల్లీలో అడుగుపెడుతున్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!