Wednesday, March 19, 2025

ఆ ఎమ్మెల్సీల రాజీనామా ఆమోదం ఎప్పుడు?

- Advertisement -

ఏపీలో చాలామంది ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. దాదాపు ఒక ఆరుగురు రాజీనామాలకు సంబంధించి ఇంతవరకు ఆమోదం దక్కలేదు. శాసనమండలిలో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. శాసన మండలి చైర్మన్గా వైసీపీకి చెందిన మోషేన్ రాజు ఉన్నారు. దీంతో శాసనమండలి సభ్యుల రాజీనామాకు ఆమోదం దక్కడం లేదు. వారు రాజీనామా చేసి దాదాపు నాలుగు నెలలు అవుతున్న మండలి చైర్మన్ మాత్రం ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. దీనిపై ఎమ్మెల్సీ లంతా లిఖితపూర్వకంగా వినతి పత్రాలు అందించిన చైర్మన్ స్పందించడం లేదు. దీంతో వారంతా న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.

ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన ఆ పార్టీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. దీంతో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు బయటకు వెళ్లిపోయారు. ముందుగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు రాజీనామా చేశారు. వారు ఇలా రాజీనామా చేసారో లేదో రాజ్యసభ చైర్మన్ వారి రాజీనామాలను ఆమోదించారు. వెంటనే ఎన్నికల సంఘం ఉప ఎన్నికలు కూడా పూర్తి చేసింది. వారిలో ఇద్దరు నేతలకు పదవులు దక్కాయి. కొత్తగా టిడిపి నుంచి సాన సతీష్ పదవి దక్కించుకున్నారు. అయితే అదే క్రమంలో వైసీపీకి చెందిన శాసనమండలి సభ్యులు ఐదుగురు వరకు రాజీనామా చేశారు. కానీ వారి రాజీనామాలు ఆమోదానికి నోచుకోలేదు.

వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, సుంకర పద్మ శ్రీ, జయ మంగళం వెంకటరమణ తదితరులు పదవులకు రాజీనామా చేశారు. పార్టీకి గుడ్ బై చెప్పారు. కానీ ఇంతవరకు వారి రాజీనామాలను ఆమోదించలేదు. తాము వ్యక్తిగతంగా రాజీనామా చేసినట్లు చెబుతున్న చైర్మన్ పరిగణలోకి తీసుకోవడం లేదు. నిబంధనల మేరకు ఫార్మేట్లో రిజైన్ సమర్పించిన శాసనమండలి చైర్మన్ పట్టించుకోకపోవడంతో ఆగ్రహంగా ఉన్నారు.

అయితే రాజీనామా చేసిన ఎమ్మెల్సీల పరిస్థితి ఘోరంగా ఉంది. వారు ఏ పార్టీలో ఉన్నారో తెలియడం లేదు. కూటమి పార్టీల నుంచి సైతం గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. అదే సమయంలో ఎమ్మెల్సీ సభ్యత్వకానికి రాజీనామా ఆమోదం పొందడం లేదు. దీంతో వీరంతా న్యాయపోరాటానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే శాసనమండలిలో వైసీపీకి స్పష్టమైన బలం ఉంది. ఆ బలం తగ్గిపోతుందన్న ఆందోళనలో వైసిపి కి చెందిన మండల చైర్మన్ పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. అయితే అనవసరంగా రాజీనామా చేశామన్న బాధ వైసిపి ఎమ్మెల్సీల్లో కనిపిస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!