నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. లేనిపోని వ్యవహారాలకు దూరంగా ఉండాలి అంటారు. అనవసర పేలాపనతో లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోకూడదు అంటారు. కానీ ఇప్పుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ఇలా లేనిపోని సమస్యలను తెచ్చుకున్నారు. అనవసరంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై కామెంట్స్ చేసి.. సోషల్ మీడియాలో టార్గెట్ అయ్యారు. లక్షలాదిమంది వ్యతిరేకించడంతో ఆందోళనకు గురయ్యారు. అదే ఆందోళనతో ఆసుపత్రి బాట పట్టారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతున్నారు.
ప్రస్తుతం జనసేన లో ఉన్నారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి. పార్టీ పవర్ లోకి వచ్చింది. ఆపై మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. దీంతో చేతినిండా సినిమాలు ఉన్నాయి. ఎంచక్కా సినిమాలు చేసుకోకుండా.. అనవసర విషయాలలో తలదూర్చుతున్నారు. లేనిపోని ఇబ్బందులు తెచ్చి పెట్టుకుంటున్నారు.
తాజాగా ఆయన నటించిన లైలా సినిమా విడుదలకు సిద్ధమయింది. ఈ క్రమంలో ఆ సినిమాకు సంబంధించిన ఈవెంట్ జరిగింది. కార్యక్రమానికి హాజరైన పృథ్విరాజ్ సినిమా విశేషాలను చెప్పుకోవచ్చు. ఆ సినిమా గురించి ప్రమోషన్ చేసుకోవచ్చు. కానీ ఉన్నపలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలకు దిగారు. అప్పట్లో 150 గొర్రెలు ఉండేవని.. వాటి సంఖ్య 11 కు పడిపోయిందని అనుచిత కామెంట్స్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఆ సినిమా యూనిట్ బృందం షాక్ కు గురైంది. సినిమాపై ఇది ప్రతికూలత చూపుతోందన్న ఆందోళన వారిలో ఉంది.
మరోవైపు 30 ఇయర్స్ పృథ్వి కామెంట్స్ క్షణాల్లో వైరల్ అయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైసిపి శ్రేణులు ఒక్కసారిగా రియాక్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో బాయ్ కాట్ లైలా అంటూ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నడుస్తోంది. ఇప్పటివరకు ఎక్స్ లో 1.25 లక్షల ట్వీట్లు వచ్చాయి. దీంతో లైలా సినిమా హీరో విశ్వక్సేన్, నిర్మాత సాహూ మీడియా ముందుకు వచ్చి తమకు తెలియకుండానే తప్పు జరిగిపోయిందని.. క్షమాపణలు చెప్పాలని కోరారు.
మరోవైపు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం నడుస్తోంది. ఆయన సినిమా కెరీర్ కు ఇబ్బందికరంగా మారింది. ఇంకోవైపు కుటుంబ సభ్యులకు సైతం పెద్ద ఎత్తున రాంగ్ కాల్స్ వస్తున్నాయి. దీంతో ఒకేసారి ఒత్తిడికి గురయ్యారు పృథ్వి. దీంతో ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రిబాట పట్టారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి వైసిపికి క్షమాపణలు చెప్పాల్సిందే నన్న డిమాండ్ ఇప్పటికీ వినిపిస్తోంది. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి