Sunday, March 16, 2025

అరెస్టుల వెనుక కూటమి భారీ స్కెచ్.. డైవర్షన్ పాలిటిక్స్!

- Advertisement -

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోంది. కానీ ఇంతవరకు ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు కాలేదు. ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి ప్రారంభం అయింది. అయితే ప్రజలను డైవర్ట్ చేసేందుకే కూటమి కొత్త ఎత్తుగడ వేసినట్లు ప్రచారం నడుస్తోంది. అందులో భాగంగానే ఈ అరెస్టుల పర్వానికి సిద్ధపడినట్లు సమాచారం. ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన వాతావరణం కనిపిస్తోంది. దారుణ పరాజయం తర్వాత వారు డీలా పడ్డారు. బయటకు వచ్చేందుకు సైతం భయపడ్డారు. దీంతో కూటమి ప్రభుత్వం కూల్ గా ముందుకు సాగింది. ఒక వ్యూహం ప్రకారం నెలకు ఒక అంశాన్ని బయటపెడుతూ ప్రజల దృష్టిని మరల్చగలిగింది. సంక్షేమ పథకాల విషయంలో జరుగుతున్న జాప్యాన్ని బయటపడకుండా చేయగలిగింది. అయితే తాజాగా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భరోసాతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి. సోషల్ మీడియాలో సైతం ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్న వారు అధికమవుతున్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఇటీవల విదేశాలకు వెళ్లారు. అటు నుంచి వచ్చి చాలా యాక్టివ్ గా పని చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలల పాలనలో వైఫల్యం చెందిందని కూడా చెప్పుకొస్తున్నారు. జగన్ 1.0 ప్రజల కోసం అని.. జగన్ 2.0 కార్యకర్తల కోసమేనని తేల్చి చెప్పారు జగన్మోహన్ రెడ్డి. దీంతో అధినేతను బలంగా నమ్మడం ప్రారంభించారు వైసీపీ శ్రేణులు. అందుకే ధైర్యంగా ముందుకు వచ్చి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడే కూటమి ఆలోచనలో పడింది. కేసులతోపాటు అరెస్టుల పర్వానికి సిద్ధపడింది. తద్వారా ప్రజలను డైవర్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

రాష్ట్రంలో రెడ్ బుక్ మూడో పేజీ తెరిచారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొన్న మధ్యన విదేశీ పర్యటనకు వెళ్లారు మంత్రి నారా లోకేష్. ఆ సందర్భంలో రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చారు. తప్పకుండా ఆ పేజీని తెరుస్తామని.. చట్టం తన పని తాను చేసుకు పోతుందని చెప్పుకొచ్చారు. తద్వారా కీలక అరెస్టులతో పాటు కేసులు ఉంటాయని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి రెడ్ బుక్ అమలు చేశారు. ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియాను అణచివేసే ప్రక్రియను చేపట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చిన కొంతమంది వ్యక్తులను టార్గెట్ చేసుకున్నారు. అందులో కొందరినీ జైలుకు పంపించగలరు. మరికొందరిని సైలెంట్ చేయగలిగారు.

అయితే అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భరోసాతో చాలామంది నేతలు, కార్యకర్తలు యాక్టివ్ గా పనిచేయడం మొదలుపెట్టారు. 2019లో తెలుగుదేశం పార్టీ దారుణ పరాజయం చవిచూసింది. ఆ పార్టీ శ్రేణులు రెండేళ్ల వరకు కోలుకోలేదు. కానీ అంతకంటే ఘోర పరాజయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎదురైంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం ఏడు, ఎనిమిది నెలల్లో కోలుకున్నారు. పార్టీలో యాక్టివ్ గా పని చేయడం ప్రారంభించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. దీనికి అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహం తోడు కావడంతో మరింత క్రియాశీలకం అవుతున్నారు. ఈ పరిణామాలతో కలత చెందిన కూటమి ప్రభుత్వం అరెస్టుల పర్వానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. కేవలం ప్రజల దృష్టిని డైవర్ట్ చేసేందుకే ఈ చర్యలకు దిగినట్లు విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!