Wednesday, March 19, 2025

అంబటి రాయుడు అవేం మాటలు.. క్రికెట్ కెరీర్ మాదిరిగానే పొలిటికల్ జర్నీ

- Advertisement -

మరో పదేళ్లపాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటారని పవన్ చెబుతున్నారు. చంద్రబాబు యాక్టివ్ గా ఉన్నంతవరకు ఆయనకే సీఎం పోస్టు అని తేల్చి చెబుతున్నారు. కానీ జనసైనికులు మాత్రం ఇంకా సీఎం సీఎం అంటూ పవన్ విషయంలో ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా ఆ కోవలోకి వచ్చారు యువ క్రికెట్ అంబటి రాయుడు. క్రికెట్ కెరీర్ ను వదులుకొని రాజకీయాల్లోకి వచ్చిన అంబటి రాయుడు క్రికెట్ మాదిరిగానే తడబడుతున్నారు. తప్పటడుగులు వేస్తున్నారు.

ఉన్నపలంగా క్రికెట్కు గుడ్ బై చెప్పారు అంబటి రాయుడు. జగన్మోహన్ రెడ్డిని స్తుతించారు. ఆయన ప్రాపకం కోసం పాకులాడారు. గుంటూరు పార్లమెంటు టికెట్ ఆశించారు. కానీ జగన్మోహన్ రెడ్డి నోరు చెప్పారు. దీంతో అప్పటివరకు జగన్మోహన్ రెడ్డిని పొగిడిన అంబటి రాయుడు యూ టర్న్ తీసుకున్నారు. వెంటనే పవన్ కళ్యాణ్ను పొగడ్తలతో ముంచెత్తడం ప్రారంభించారు. ఏకంగా జనసేనలో చేరిపోయారు. ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసేందుకు స్టార్ క్యాంపైనర్ జాబితాలో చేరిపోయారు.

అయితే గత కొంతకాలంగా ఆయన వ్యవహార శైలి మారింది. బిజెపికి అనుకూల ప్రచారం మొదలుపెట్టారు. ఆ మధ్యన బిజెపి సమావేశాలకు హాజరయ్యేవారు. ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తేశారు. దీంతో అంబటి రాయుడు బిజెపిలో చేరిక ఖాయమని అంతటా ప్రచారం జరిగింది.

అయితే ఉన్నట్టుండి ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని.. దానికోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని చెప్పడం విశేషం. అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి అంబటి రాయుడు వెళ్ళిపోతున్నారు. కొద్దిరోజుల వరకు కనిపించడం లేదు. అందుకే ఆయన వ్యవహార శైలి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. క్రికెట్ కెరీర్ మాదిరిగానే పొలిటికల్ కెరీర్ లో సైతం అంబటి రాయుడు తీరు ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. చంద్రబాబు మరో 10 సంవత్సరాలు పాటు సీఎం గా ఉంటారని పవన్ చెపుతుంటే.. పవన్ కళ్యాణ్ ను సీఎం చేస్తామని అంబటి రాయుడు చెబుతున్నారు. దీంతో ఒక రకమైన అస్పష్టత కనిపిస్తోంది. అంబటి రాయుడు తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!