Wednesday, March 19, 2025

టిడిపి ఆశావాహులకు చంద్రబాబు షాక్!.. ఎమ్మెల్సీలుగా నో ఛాన్స్!

- Advertisement -

టిడిపి ఆశావహులకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. టిక్కెట్లు త్యాగం చేసిన వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎల్లో మీడియా సైతం దీనిపై ఎప్పటికప్పుడు లీకులు ఇచ్చింది. తప్పకుండా త్యాగధనులకు సీట్లు ఇస్తారని అదేపనిగా ప్రచారం చేసింది. తీరా వివిధ సమీకరణల పేరు చెప్పి చంద్రబాబు చాలామందికి హ్యాండ్ ఇచ్చారు. దీంతో వారు లబోదిబోమంటున్నారు. చంద్రబాబు రాజకీయాలు చూసి షాక్ అవుతున్నారు.

ఎమ్మెల్యేల కోట కింద 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 20న ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జనసేన నుంచి నాగబాబు నామినేషన్ కూడా దాఖలు చేశారు. మిగతా నాలుగు పదవులకు సంబంధించి టిడిపికి మూడు, బిజెపికి ఒకటి లభించింది. అయితే ఆశావహులకు కాదని కొత్తవారికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు. బీద రవిచంద్ర, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు పేర్లను ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ఆశావాహులు షాక్ కు గురయ్యారు.

ప్రధానంగా పిఠాపురం వర్మకు ఈసారి ఎమ్మెల్సీ పదవి ఖాయమని తెగ ప్రచారం నడిచింది. పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీటును త్యాగం చేశారు వర్మ. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలి పదవి వర్మదేనంటూ హడావిడి నడిచింది. కానీ అదిగో ఇదిగో అంటూ కాలయాపన తప్ప కార్యరూపం దాల్చలేదు. ఈసారి అవకాశం ఉంటుందని ప్రచారం నడిచింది. కానీ మొండి చేయి మిగిలింది. దీంతో వర్మ తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సమాచారం.

మైలవరం టికెట్ త్యాగం చేశారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టిడిపి లోకి రావడంతో తన సీటును వదులుకోవాల్సింది. అయితే అప్పట్లో ఉమామహేశ్వర సేవలను కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే వాడుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. కానీ ఏడాది అవుతున్న ఎటువంటి పదవి ఆయనకు ఇవ్వలేదు.

వంగవీటి రాధాకృష్ణ సైతం హాండ్ ఇచ్చారు చంద్రబాబు. 2019 ఎన్నికలకు ముందు అనూహ్యంగా టిడిపిలోకి చేరారు ఆయన. ఆ ఎన్నికల్లో టికెట్ అకామిడేట్ చేయలేకపోయారు బాబు. పోనీ 2024 ఎన్నికల్లో సర్దుబాటు చేస్తారని అంతా భావించారు. అప్పుడు కూడా చేతులెత్తేశారు. అయితే కూటమి అధికారంలోకి రావడంతో రాధాకృష్ణకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని.. ఒకానొక దశలో మంత్రిగా కూడా అవకాశం ఉంటుందని తెగ ప్రచారం నడిచింది. అయితే అటువంటిదేమీ లేకుండా పోయింది. రాధాకృష్ణ పేరు ప్రకటించకపోయేసరికి ఆయన అనుచరులు ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది.

బుద్ధ వెంకన్నది అదే పరిస్థితి. లోకేష్ మనిషిగా వెంకన్న పై ముద్ర ఉంది. చంద్రబాబుపై వినయ విధేయతలు ప్రదర్శించే బుద్ధ వెంకన్న ఈ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ సీటును ఆశించారు. బిజెపికి పొత్తులో భాగంగా వెళ్లడంతో సుజనా చౌదరి అక్కడ పోటీ చేశారు. వెంకన్న ఎమ్మెల్సీ పదవిని బలంగా కోరుకున్నారు. తనకే వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు మాత్రం ముఖం చాటేశారు. అయితే వీరే కాదు యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్ బాబు, ఏరాసు ప్రతాపరెడ్డి.. ఇలా చాలామంది నేతలు ఆశావాహులుగా ఉండేవారు. కానీ వారికందరికీ షాక్ ఇచ్చారు చంద్రబాబు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!