Wednesday, March 19, 2025

జగన్మోహన్ రెడ్డితో అరవింద్ కేజ్రీవాల్ దోస్తీ.. టార్గెట్ చంద్రబాబు!

- Advertisement -

దేశంలో తృతీయ ఫ్రంట్ పురుడుబోసుకోనుందా? దానికి అమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ సారధ్యం వహించనున్నారా? తప్పకుండా ఆయన ప్రభావితం చేస్తారా? కాంగ్రెస్ లేని తృతీయ ఫ్రంట్ ఆవిర్భావమే ఆయన లక్ష్యమ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. బిజెపి ఒక వ్యూహం ప్రకారం అరవింద్ కేజ్రీవాల్ ను తొక్కి పెట్టింది. సర్వ శక్తులు ఒడ్డి ఓడించగలిగింది. కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరాటం అమ్ ఆద్మీ పార్టీని దెబ్బతీసింది. అందుకే ఇప్పుడు అరవింద్ కేజ్రివాల్ తృతీయ ఫ్రంట్ కు తప్పకుండా ప్రయత్నాలు చేస్తారు.

ప్రస్తుతం కేజ్రీవాల్ ఏ చట్టసభల్లో సభ్యుడు కాదు. అలాగని ఖాళీగా ఉండలేడు. అందుకే జాతీయస్థాయి రాజకీయాల్లో బిజెపితో పాటు కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు సిద్ధపడతాడు. అందుకు తృతీయ ఫ్రంట్ ఒకటి తప్పకుండా తయారు చేస్తాడు. ఆ రెండు జాతీయ పార్టీలను వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలను ఫ్రంట్ గొడుగు కిందకు తీసుకొస్తాడు. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కలుపు కెళ్లే ప్రయత్నం తప్పకుండా చేస్తారు. ఎందుకంటే ఇక్కడ టిడిపి కూటమిని దెబ్బతీయాలన్నది కేజ్రీవాల్ ప్లాన్. ఎట్టి పరిస్థితుల్లో 2029 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవాలని గట్టిగానే ప్రయత్నిస్తారు కేజ్రీవాల్. అందుకు కారణాలు లేకపోలేదు. తన ఓటమిక్కి కారణం చంద్రబాబు అని ఆగ్రహంగా ఉన్నారు. నిన్నటి ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందుకే ఏపీ ఎన్నికల్లో రివెంజ్ తీర్చుకునేందుకు కేజ్రీవాల్ తప్పకుండా ప్రయత్నం చేస్తారు.

2019 ఎన్నికల్లో ఏపీలో టిడిపి కోసం ఎన్నికల ప్రచారం చేశారు అరవింద్ కేజ్రీవాల్. నాడు చంద్రబాబు బిజెపిని వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీని సమర్థించారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తానని శపధం చేశారు. అప్పట్లో బీజేపీ వ్యతిరేక పక్షంలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ చంద్రబాబుకు మద్దతు తెలిపారు. ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి మద్దతుగా ప్రచారం కూడా చేశారు. కానీ ఆరేళ్లు తిరగకముందే అదే అరవింద్ కేజ్రీవాల్ వ్యతిరేకంగా ప్రచారం చేసి తన బుద్ధిని బయట పెట్టుకున్నారు చంద్రబాబు.

అందుకే ఇప్పుడు తృతీయ ఫ్రంట్ ఏర్పాటు ద్వారా ఇటు జగన్మోహన్ రెడ్డి, అటు కెసిఆర్ లను చేరదీయాలని అరవింద్ కేజ్రీవాల్ భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని దూరంగా ఉంచడం ద్వారా వారిద్దరూ అరవింద్ కు దగ్గర కావడం ఖాయం. అయితే వారిద్దరి ద్వారా చంద్రబాబుపై భారీ రివేంజ్ తీర్చుకోవాలని భావిస్తున్నారు కేజ్రీవాల్. అందుకే వచ్చే ఎన్నికల నాటికి తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉండే జగన్మోహన్ రెడ్డి, కెసిఆర్ లను అధికారంలోకి తీసుకొస్తానని కేజ్రీవాల్ శపథం చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే అరవింద్ కేజ్రీవాల్ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి రానున్నారు. చంద్రబాబు ఓటమికి అవసరమైన వ్యూహాలను అమలు చేయనున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!