ఏపీలో మందుబాబులకు షాక్ ఇచ్చింది చంద్రబాబు సర్కార్. అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యంతో పాటు సరసమైన ధరలకు అందిస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. దీంతో మందుబాబులు ఎంతగానో ఆనందించారు. టిడిపి కూటమిని ఆదరించారు. అయితే ఇప్పుడు మద్యం వ్యాపారుల కళ్ళల్లో ఆనందం చూసేందుకు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది చంద్రబాబు సర్కార్. మద్యం పార్టీలపై 15% ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ధర ఈ రోజు నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఒక్కసారిగా మందుబాబులు షాక్ కు గురయ్యారు. సర్కారు తీరును ఆక్షేపిస్తున్నారు. తక్కువ ధరకు మద్యాన్ని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
వైసీపీ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు నడిచాయి. ప్రభుత్వమే స్వయంగా మద్యం దుకాణాలను నడిపింది. అయితే నాసిరకం మద్యాన్ని సరఫరా చేస్తున్నారని.. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారని నాటి విపక్షాలు ఆరోపించాయి. తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పాత ధరలకే అందిస్తామని చెప్పుకొచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మడత పేచీ వేశారు. పాత ప్రీమియం బ్రాండ్లు అందుబాటులోకి వచ్చినా.. ధరల్లో మాత్రం ఏ మాత్రం మార్పు లేదు. పాత ధరల ఊసులేదు. బ్రాండెడ్ మద్యం ధరలు ఇతర రాష్ట్రాలతో పోల్చితే అధికంగా ఉన్నాయి. ఇప్పుడు అది చాలాదన్నట్టు అదనంగా 15% పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఒక్క బాటిల్ పై పది నుంచి 15 రూపాయలు పెరగనుంది. మందుబాబులపై అదనపు భారం పడనుంది.
మద్యం వ్యాపారుల కళ్ళల్లో ఆనందం చూసేందుకు చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అప్పట్లో 20% మార్జిన్ ఇస్తామని కూటమి సర్కార్ ప్రకటించింది. దీంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఒక్క దరఖాస్తు రూపంలోనే దాదాపు 2000 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. అయితే ఇక్కడే ఇచ్చిన మాట తప్పారు చంద్రబాబు. కేవలం 14.5% మార్జిన్ మాత్రమే వ్యాపారులకు ఇచ్చారు. జీఎస్టీ పోను 9% మాత్రమే వారికి ఆదాయం సమకూర్తోంది. దీంతో భారీగా పెట్టుబడులు పెట్టి దుకాణాలు ఏర్పాటు చేస్తే నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని వ్యాపారాలు లబోదిబోమన్నారు. ప్రభుత్వం తీరును ఆక్షేపిస్తూ పలుమార్లు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అలాగైతే మద్యం సరఫరాను అమ్మకాలను నిలిపి వేస్తామని హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. గతంలో హామీ ఇచ్చినట్టుగా 20 శాతం మార్జిన్ అమలు చేయాల్సి వచ్చింది. అయితే ఏకంగా మద్యం బాటిల్ పై 15 నుంచి 20 రూపాయలు పెరగనుండడంతో మందుబాబులు రోడ్డు ఎక్కడం ఖాయంగా తెలుస్తోంది.
అప్పట్లో వైసీపీ హయాంలో నాసిరకం మద్యం, భారీ ధరలు వంటి వాటిని ప్రచారాస్త్రంగా మార్చుకుంది కూటమి. కానీ ఇప్పుడు కూటమి సర్కార్ చేస్తుంది ఏమిటి అన్న ప్రశ్న వినిపిస్తోంది. అధ్యయనం పేరిట పొ రుగు రాష్ట్రాలకు వెళ్లిన మంత్రుల బృందం.. లేనిపోని సిఫారసులు చేసింది. పేరుకే బ్రాండెడ్ మద్యం కానీ.. పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే ధర అధికంగా ఉందని మందుబాబులు చెబుతున్నారు. ధరలను భరించలేకున్నామని చెప్పుకొస్తున్నారు. అయితే మద్యం ధరల పెంపుతో సారా ప్రవహిస్తోంది. పక్క రాష్ట్రాల మధ్య మళ్లీ చలామణి అవుతోంది