Tuesday, April 22, 2025

మహిళలపై దాడులు.. ఇప్పటికీ వైయస్సార్ కాంగ్రెస్ పై విష ప్రచారం

- Advertisement -

దొంగే దొంగ అన్నట్టు ఉంది కూటమి ప్రభుత్వం దుస్థితి. ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేదు. సంక్షేమ పథకాల ఊసు లేదు. పరిశ్రమలు రావడం లేదు. ఉద్యోగాలు లేవు. అప్పుడే ఏడాది పాలన పూర్తయింది. ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభం అయింది. దానిని దృష్టి మళ్లించడం కోసం ఏవేవో చేస్తున్నారు సీఎం చంద్రబాబు. ఆపై ఎల్లో మీడియాతో కథనాలు రాయించుకుంటున్నారు. ఆహా ఓహో అంటూ తమను తామే భుజం తట్టుకుంటున్నారు.

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది సమీపిస్తోంది. పాలన, అభివృద్ధి, సంక్షేమం మాట అటు ఉంచితే శాంతి భద్రతల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. సీనియారిటీ, సిన్సియారిటీ అంటూ తనకు తాను చెప్పుకునే చంద్రబాబు ఈ విషయంలో ఫెయిల్యూర్ అవుతున్నారు. పోలీస్ శాఖ దారుణంగా ఫెయిల్ అయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలపై దాడులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రతిరోజు సగటున గంటకు రెండు మూడు ఘటనలు జరుగుతున్నాయి. మహిళలపై అకృత్యాలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఏదో ఒక చోట ఈ ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. నియంత్రించాల్సిన కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికీ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పై బురద జల్లుతూనే ఉంది. అయితే అప్పట్లో వైసిపి ఫెయిల్ అయింది కనుక పక్కన పెట్టారు. మరి కోటను ప్రభుత్వం చేస్తుంది ఏంటి? వారు చేసిన ప్రకటనలకు వాస్తవ పరిస్థితికి పొంతన లేకుండా పోతోంది. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మహిళలపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి.

2017 లో టిడిపి ప్రభుత్వ హయాంలో కర్నూలులో జరిగింది సుగాలి ప్రీతి కేసు. కానీ ఇప్పటికీ ఆ కేసును కొలిక్కి తేవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. 2019 వరకు అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం ఆ కేసును నీరుగార్చింది. ప్రాథమిక ఆధారాలను చెరిపేసింది. తరువాత వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేసిన వర్కౌట్ కాలేదు. అంతకుముందున్న ప్రాథమిక ఆధారాలు చెరిపేయడంతో కేసు ముందుకు సాగలేదు. అయితే ఇదే కేసును అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందారు పవన్ కళ్యాణ్. కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ కేసును రీవోపెన్ చేస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న దాని గురించి పట్టించుకోలేదు.

వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళల రక్షణకు పెద్దపీట వేస్తూ దిశా చట్టాన్ని తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. రాష్ట్రవ్యాప్తంగా దిశ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేశారు. మహిళలపై దాడులు జరిగిన గంటల వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకునేవారు. దిశ పోలీస్ స్టేషన్ ఉందన్న ధైర్యం మహిళల్లో ఉండేది. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు.

రాష్ట్రంలో చిన్నపిల్లలు మొదలు పెద్దవారి వరకు మహిళలు దాడులకు గురవుతున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా వారిపై అకృత్యాలు పెరుగుతున్నాయి. కానీ వాటిని నియంత్రించకుండా కూటమి ప్రభుత్వం రాజకీయ విమర్శలకు పరిమితం అవుతుంది. పోలీసులతో పాటు రాష్ట్ర అత్యున్నత దర్యాప్తు సంస్థ సిఐడి సైతం రాజకీయ ప్రత్యర్థులను వేటాడడానికే ఉపయోగపడుతోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వేలాది మంది మహిళలు అదృశ్యమయ్యారని సంచలన ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. తాను చేసిన ఆరోపణలను నిరూపించే అవకాశం వచ్చింది. కానీ వాటిపై దృష్టి పెట్టలేదు పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పక్కకు తప్పుకున్నారు. క్యాబినెట్లో మహిళా మంత్రులతో మాట్లాడిస్తున్నారు. ఏడాది కిందట దిగిపోయిన వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పై దుమ్మెత్తి పోసేలా చేస్తున్నారు. కానీ తాము అధికార పక్షం అన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. యధా రాజా తథా ప్రజా అన్నట్టు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాదిరిగానే మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!