Sunday, January 26, 2025

AP Politics: సుప్రీం కోర్టు కి బాలినేని :: EVMల గుట్టు స్పష్టం గా లీక్ !

- Advertisement -

AP Politics: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్ పార్టీ నేతలపై, కార్యకర్తలపై దాడులు ఏ రకంగా జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. అధికారంలోకి వచ్చిన కేవలం మూడు నెలల్లోనే పార్టీ పెద్దల నుంచి గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల వరకు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ అనేక మందిని చంపడం జరిగింది. అసలు కూటమి ప్రభుత్వం గెలిచినదే అనేక రకాల తప్పులు చేసి కాబట్టి అవి బయట పడకుండా అనేక రకమైన డైవెర్షన్ పాలిటిక్స్ కి తెరలేపుతూ ముందుకి వెళ్తున్నారు కూటమి అధినేతలు. తాజాగా ఒ౦గోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటి చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈవీఎం లపై ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుకు ఎన్నికల కమిషన్ సరిగా స్పందించలేదు. సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులకు భిన్నంగా రీ వెరిఫికేషన్ చేయకుండా మాక్ పోలింగ్ చేస్తామని చెప్పింది ఎన్నికల కమిషన్. ఈ విషయం గురించి బలినేని హై కోర్ట్ లో ఫిర్యాదు చేయడంతో మొత్తం ఈవీఎం ల గుట్టు బయటపడినట్లు అయింది.

సుప్రీమ్ కోర్ట్ వీవీ ప్యాడ్లలోని డేటాని 45 రోజుల పాటు భద్రపరచాలి అని చెప్తే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 20 రోజుల్లోనే వాటిని కాల్చేశాము అని ఎన్నికల కమిషన్ చెప్తోంది అని బాలినేని హై కోర్ట్ లో ఫిర్యాదు చేశారు. అసలు ఏం జరిగింది తప్పు ఎక్కడ జరిగింది అనే విషయం విచారణలో తేలాల్సి ఉంది. కానీ కచ్చితంగా ఎక్కడో తప్పు జరిగింది అనే విషయం అర్ధం అవుతోంది ఎన్నికల సంఘం వైఖరి చూస్తుంటే. ఇదంతా గమనిస్తుంటే తొందర్లోనే ఈవీఎం ల గుట్టు స్పష్టం గా బయట పడేలా ఉంది.

మరొక పక్క బుడమేరుకి అంత వరద వచ్చి విజయవాడ మునిగిపోవడానికి కూడా చంద్రబాబే కారణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని అమాయకులైన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంతున్నరంటూ ఆరోపించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బా రెడ్డి. కావాలని తమ పార్టీ నేతలని రకరకాల కేసుల్లో ఇరికించి మరీ అరెస్ట్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈవీఎం లలో జరిగిన అవకతవకలపై పోరాడుతున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డికి కచితంగా న్యాయం జరుగుతుందని ఆయన సుప్రీమ్ కోర్ట్ కి కూడా వెళ్తారని తొందర్లోనే ఈవీఎం ల గుట్టు ప్రపంచానికి తెలియజేస్తాం అని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తానికి ఈవీఎం లలో అవకతవకలు జరిగాయని అవి తొందర్లోనే ప్రజలకి తెలుస్తుంది అనే ఆశాభావం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కనిపిస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!