Wednesday, March 19, 2025

జనసేనలో ఉనికి కోసం బాలినేని పడరాని పాట్లు!

- Advertisement -

జనసేనలో బాలినేని శ్రీనివాస్ రెడ్డికి సరైన గుర్తింపు దక్కడం లేదా? ఆయన చేరికను జనసేన నేతల వ్యతిరేకిస్తున్నారా? ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడు రియాజ్ కు బాలినేని రాక ఇష్టం లేదా? బాలినేని కంటే తానే సీనియర్ అని ఎందుకు చెబుతున్నట్టు? టిడిపి ఎమ్మెల్యే జనార్ధన్ తీవ్రంగా ఎందుకు వ్యతిరేకిస్తున్నట్టు? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఈ ఎన్నికల్లో ఒంగోలు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు బాలినేని. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా వైసీపీలో పెద్దగా యాక్టివ్ గా పని చేయలేదు. జగన్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ జనసేన గూటికి చేరారు. అయితే గత వైసిపి హయాంలో బాలినేని వ్యవహార శైలి పై టిడిపిలో అభ్యంతరాలు ఉన్నాయి. బాలినేని ఒంగోలు జిల్లా నాయకత్వాన్ని టిడిపి వ్యతిరేకిస్తోంది. అలాగని సొంత పార్టీ జనసేన నేతలు సైతం ఆహ్వానించడం లేదు. దీంతో బాలినేని పరిస్థితి తీసికట్టుగా మారింది. అనవసరంగా జనసేనలో చేరాను అన్న బాధ ఆయన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు వైసీపీకి తిరిగి రాలేక జనసేనలోనే తాడో పేడో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఆయనది.

ముఖ్యంగా ఒంగోలు నియోజక వర్గం తో పాటు మున్సిపల్ కార్పొరేషన్ లో తన సత్తా చాటాలని బాలినేని శ్రీనివాస్ రెడ్డి భావిస్తున్నారు. ఆయనకంటూ ప్రత్యేకమైన కేడర్ ఉంది. ప్రస్తుతం ఒంగోలు కార్పొరేషన్ లో వైసీపీకి స్పష్టమైన బలం ఉంది. అందుకే అక్కడ జనసేనకు బలం చూపి తన సత్తా చాటాలని బాలినేని భావిస్తున్నారు. 20 మంది కార్పొరేటర్ లను జనసేనలోకి రప్పించేందుకు బాలినేని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలినేని హైదరాబాదులో ఉండగా ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి రంగంలోకి దిగారు. జన్మదిన వేడుకల పేరిట హడావిడి చేశారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరితో మంతనాలు పూర్తి చేసినట్లు సమాచారం. అన్ని కుదిరితే త్వరలో 20 మంది కార్పొరేటర్లు పవన్ సమక్షంలో జనసేనలో చేరేందుకు వ్యూహం రూపొందించినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు బాలినేని జనసేనలో పట్టు నిలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తరచూ పవన్ కళ్యాణ్ ను కలుస్తున్నారు. తద్వారా తాను జనసేన కీలక నేతను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు కూటమి నేతలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ని పట్టించుకోవడం లేదు. ఇంకోవైపు జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ సైతం బాలినేనికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. జనసేనలో బాలినేని కంటే తానే సీనియర్ నని.. అస్సలు బాలినేనిని ఖాతరు చేయడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కక్క లేక మింగలేని పరిస్థితుల్లో బాలినేని ఉన్నారు. అందుకే జనసేన లోనే తాను ఏంటో నిరూపించుకోవాలని భావిస్తున్నారు. తద్వారా 2029 ఎన్నికల నాటికి తన పట్టు నిలుపుకోవాలని చూస్తున్నారు.

ఒకప్పుడు ఒంగోలు అంటే బాలినేని.. బాలినేని అంటే ఒంగోలు అన్న పరిస్థితి ఉండేది. వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎంతగానో ప్రోత్సహించారు. 2009లో గెలిచేసరికి మంత్రి పదవి కూడా ఇచ్చారు. వైసిపి ఆవిర్భావంతో ఆ పార్టీలో కూడా ఎనలేని ప్రాధాన్యత లభించింది. చివరకు బాలినేని బొట్టు పెట్టిన వారికి జగన్మోహన్ రెడ్డి టిక్కెట్లు కూడా ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కీలక పోర్టు పోలియోతో అవకాశం కల్పించారు. కానీ రాజకీయ సమీకరణలో భాగంగా విస్తరణలో మంత్రి పదవి తొలగించిన నాటి నుంచి తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు బాలినేని. అనూహ్యకర పరిస్థితుల్లో పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసీపీకి డామేజ్ చేయాలని చూశారు. కానీ తాను చేరిన జనసేన లోనే ఆయనకు తగిన గుర్తింపు దక్కడం లేదు. రాజకీయ భవిష్యత్తు మాట అటుంచితే.. ఉనికి కోసమే పడరాని పాట్లు పడుతున్నారు

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!