Sunday, March 16, 2025

ఉత్తరాంధ్రలో ఆ ఇద్దరు నేతలకు బిజెపి గాలం!

- Advertisement -

ఉత్తరాంధ్ర పై బిజెపి ఫోకస్ పెట్టిందా? ఆపరేషన్ ఆకర్స్ లో భాగంగా వైసిపి కీలక నేతలను గాలం వేస్తోందా? అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ దీనికి నాయకత్వం వహిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో సైతం ప్రభావం చూపించింది భారతీయ జనతా పార్టీ. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం వర్గాన్ని బిజెపి కైవసం చేసుకుంది. దీంతో ఆ జిల్లా నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను ఆకర్షించాలని గట్టి ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.

వాస్తవానికి విశాఖ నగరంలో బిజెపికి పట్టు ఉంది. కానీ రూరల్ ప్రాంతానికి వచ్చేసరికి మాత్రం ఆశించిన స్థాయిలో కేడర్ లేదు. పేరు మోసిన లీడర్లు లేరు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో సైతం ఆ పార్టీకి బలం అంతంత మాత్రమే. అటువంటిది పొత్తులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం వర్గాన్ని కైవసం చేసుకుంది భారతీయ జనతా పార్టీ. అక్కడ బిజెపి తరఫున పోటీ చేసిన నడికుదుటి ఈశ్వరరావు గెలిచారు. దీంతో శ్రీకాకుళం జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లో సైతం పట్టు సాధించాలని బిజెపి భావిస్తోంది.

రాయలసీమ జిల్లాలకు చెందిన సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే. ఆయన బిజెపిలోకిరోల్ ప్లే చేస్తున్నారు. పైగా టిడిపి అధినేత చంద్రబాబుకు సన్నిహితుడు. బిజెపిని బలోపేతం చేయడం ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలన్నది సీఎం రమేష్ ప్లాన్ గా తెలుస్తోంది. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసంతృప్త నాయకులపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు సమాచారం.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన ప్రసాదరావు సీనియర్ మోస్ట్ లీడర్. ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ నేతల్లో ఒకరు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆయన కుమారుడు రామ్ మనోహర్ నాయుడు భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తున్నారు. అందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అయితే సరిపోదని ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే ఆయనకు బిజెపి నుంచి ఆహ్వానం వచ్చిందని తెలుస్తోంది. అయితే కొద్ది రోజులు ఆగి ఒక నిర్ణయానికి వస్తానని ధర్మాన ప్రసాదరావు చెప్పినట్లు సమాచారం. టిడిపి తో పాటు జనసేనలోకి వెళ్లాలని చూసినా అక్కడ నో ఎంట్రీ. అందుకే బిజెపి ఆహ్వానాన్ని మన్నించినట్లు సమాచారం.

ఇంకోవైపు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కు సైతం బిజెపి నుంచి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఆమదాలవలస నియోజకవర్గ బాధ్యతలు నుంచి జగన్మోహన్ రెడ్డి తమ్మినేని సీతారాంను తప్పించారు. అప్పటినుంచి అధినేత తీరు పట్ల ఆగ్రహంతో ఉన్నారు సీతారాం. పైగా కుమారుడు చిరంజీవి నాగ్ రాజకీయ భవిష్యత్తు కోసం సైతం పావులు కదుపుతున్నారు సీతారాం. అందుకే బిజెపి నుంచి వచ్చిన ఆహ్వానాన్ని ఆయన సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతల వ్యవహార శైలి ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారితీస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!